ENGLISH

ట్రోలర్స్ కి మైత్రీ వారి హెచ్చరిక

07 December 2024-17:15 PM

అల్లు అర్జున్, సుకుమార్ కాంబో మూవీ పుష్ప-2 ఎక్కడ చూసినా ఫైరే. దేశ విదేశాల్లో పుష్ప రాజ్ సత్తాచాటుతున్నాడు. పుష్ప2 మూవీపై ఎన్ని ప్రశంసలు వస్తున్నాయో, అన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. కారణం మెగా వర్సెస్ అల్లు. వీరి మధ్య నెలకొన్న ఫ్యాన్ వార్ తెలుగు రాష్ట్రాల్లో సినిమాపై ప్రభావాన్ని చూపిస్తోంది. ఇది కొంతవరకు  విచారించాల్సిన విషయమే. ఎందుకంటే ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. పైగా బాలీవుడ్ వాళ్లు తెలుగు సినిమా, తెలుగు హీరో ఎదగటం భరించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రతి తెలుగు సినిమాని ట్రోల్ చేస్తున్నారు. హీరోలని, దర్శకుల్ని ఇంకా పాయింట్ అవుట్ చేస్తున్నారు. ఇలాంటి టైం లో కలిసికట్టుగా పోరాడాల్సింది పోయి, యూనిటీ లేకుండా మనలో మనమే కొట్టుకుంటున్నాం.

పుష్ప 2 హిట్ అయితే, అత్యధిక వసూళ్లు సాధిస్తే ఆ క్రెడిట్ తెలుగు మూవీకి దక్కుతుంది. బన్నీ కి కాదు. ఇంత చిన్న విషయం అర్థం చేసుకోకుండా ఫ్యాన్ వార్ ఎందుకు. ఇలా అయితే నెక్స్ట్ మంత్ గేమ్ చేంజెర్ మూవీ రిలీజ్ ఉంది. అప్పుడు బన్నీ ఫాన్స్ రెచ్చిపోరా. దీని వలన మొత్తం సినిమా నష్టపోతోంది, వ్యక్తి కాదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బన్నీని టార్గెట్ చేయటం కోసం సినిమాలో ఉన్న డైలాగ్ ఒకటైతే, ఇంకోలా ప్రచారం చేస్తూ మెగా ఫాన్స్ ని రెచ్చగొడుతున్నారు. దీనిపై తాజాగా మైత్రి మూవీ మేకర్స్ స్పందించింది.

ఎవరికి వారు లేనిది ఊహించి, ఓన్ క్రియేటివిటితో కొన్ని డైలాగులు పుష్ప-2 లోవి అంటూ ప్రచారం చేస్తున్నారు. వాంటెడ్ గా సినిమాపై నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు ఆపండి, లేకపోతే ఇలాంటి పోస్ట్ లు పెట్టిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని మైత్రి మూవీ మేకర్స్ హెచ్చరిక జారీ చేసింది. అంతే కాదు పుష్ప 2 హిట్ అయిన సందర్భంగా బన్నీ ఫ్యాన్స్‌ పేరు చెప్పి ఇంటర్వ్యూలు ఇస్తున్నవారితో కూడా తమకి ఎలాంటి సంబంధం లేదని అల్లు అర్జున్ ఫ్యాన్స్, వెల్ఫేర్ అసోసియేషన్ అనౌన్స్ చేసింది.

ALSO READ: పుష్ప 2 రెండు రోజుల కలక్షన్ 400 కోట్లా!?