ENGLISH

'నాంది' మూడు రోజుల వ‌సూళ్లెంత‌?

22 February 2021-13:47 PM

అల్ల‌రి న‌రేష్‌కి కంప్లీట్ కమ్ బ్యాక్ సినిమాగా నిలిచిపోయింది.. `నాంది`. ఎప్పుడూ కామెడీ వేషాలేసే న‌రేష్‌.. ఈసారి సీరియ‌స్ పాత్ర‌లో క‌నిపించాడు. న‌రేష్ ని కొత్త‌గా చూపించార‌ని టాలీవుడ్ మొత్తం ఆ ద‌ర్శ‌కుడి భుజం తుడుతోంది. శుక్ర‌వారం విడుద‌లైన ఈ చిత్రానికి మంచి రివ్యూలు వ‌చ్చాయి. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ఈ చిత్రానికి ద‌క్కాయి. అయితే వ‌సూళ్ల ప‌రంగా ఎంత వ‌ర‌కూ సేఫ్ గా ఉంటుంద‌న్న‌దే అంద‌రి ప్ర‌శ్న‌. అదృష్ట‌వ‌శాత్తూ.. `నాంది`కి మంచి వ‌సూళ్లే ల‌భించాయి.

 

మూడు రోజుల‌కుగానూ దాదాపు 11 కోట్ల (గ్రాస్) సంపాదించుకుంది. షేర్ రూపంలో చూస్తే 4 నుంచి 5 కోట్ల వ‌ర‌కూ ఉండొచ్చు. మ‌రో విష‌యం ఏమిటంటే.. ఈ సినిమా ఓటీటీ రైట్స్ `ఆహా` కొనుగోలు చేసింది. శాటిలైట్ రూపంలోనూ మంచి డ‌బ్బులే వ‌చ్చాయి. ఈ రెండింటి రూపంలో స‌గానికి పైగా పెట్టుబ‌డి తిరిగి వ‌చ్చేసింద‌ని తెలుస్తోంది. అంటే.. `నాంది` సేఫ్ జోన్ లో ఉన్న‌ట్టే. అన్న‌ట్టు `నాంది` టీమ్ నుంచే త్వ‌ర‌లో మ‌రో సినిమా రాబోతోంది. న‌రేష్‌.. నాంది ద‌ర్శ‌కుడితో, నిర్మాత‌తో మ‌రో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. అందుకు సంబంధించిన డిటైల్స్ త్వ‌ర‌లోనేబ‌య‌ట‌కు వ‌స్తాయి.

ALSO READ: ఫ్లాప్ హీరోతో సినిమా ఏంట‌ని.. వేళాకోళం చేస్తే...