ENGLISH

తాత పాత్రలో మనవడు?

12 March 2018-11:15 AM

మహానటి సావిత్రి జీవితాన్ని ఆధారం చేసుకుని నిర్మిస్తున్న చిత్రం ‘మహానటి’. 

ఈ చిత్రంలో అలనాటి మహామహుల పాత్రల్లో ప్రముఖ నటీనటులు మెరవనున్నారు. అందులో భాగంగానే ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలలో ఎవరు నటిస్తారు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, మహానటి చిత్రంలో ఏఎన్ఆర్ పాత్రలో ఆయన సొంత మనవడు అయిన నాగ చైతన్య కనిపించనున్నాడు అన్నది ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హల్చల్ చేస్తున్న వార్త. అయితే ఈ వార్త పైన ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. 

అలాగే ఎన్టీఆర్ పాత్రలో తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తాడు అన్న మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. అయితే ఇప్పటికే ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, దుల్కర్, సమంతా, విజయ్ దేవేరకొండ తదితర ప్రముఖ నటులు ఈ చిత్రంలో చేస్తున్నారు.

మొత్తానికి ఈ వార్త నిజమైతే.. తాత పాత్రలో మనవడు కనిపిస్తాడు.

 

ALSO READ: పవన్ భూమిపూజ: ఎందుకంత రహస్యం?