ENGLISH

చైతూ ఓవర్సీస్‌లో కుమ్మేస్తాడట

16 June 2018-12:07 PM

మారుతి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. 'శైలజారెడ్డి అల్లుడు' అనే డిఫరెంట్‌ టైటిల్‌ని ఈ సినిమా కోసం ఫిక్స్‌ చేశారు. మారుతి డైరెక్షన్‌ అంటే, అందులో కామెడీకి మంచి స్కోప్‌ వుంటుంది. కామెడీ నేపథ్యమున్న లవ్‌ స్టోరీస్‌కి ఓవర్సీస్‌లో మంచి మార్కెట్‌ జరుగుతుంటుంది. 

అందుకే, 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాకి ఓవర్సీస్‌ నుంచి మంచి ఆఫర్‌ వచ్చిందట. ఏకంగా 3.1 కోట్లకు ఓవర్సీస్‌ రైట్స్‌ అమ్ముడుపోయాయని సమాచారమ్‌. హాట్‌ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్‌ ఈ సినిమాలో నాగచైతన్యతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేయబోతోంది. సీనియర్‌ నటి రమ్యకృష్ణ ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కన్పించనుంది. మారుతి దర్శకత్వం వహించిన 'భలే భలే మగాడివోయ్‌' ఓవర్సీస్‌లోనూ, తెలుగు స్టేట్స్‌లోనూ వసూళ్ల పంట పండించిన సంగతి తెల్సిందే. 

లేటెస్ట్‌గా తీసుకుంటే 'మహానుభావుడు' సినిమాతో మరో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు మారుతి. ఈ నేపథ్యంలోనే 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాకి ఓవర్సీస్‌ నుంచి భారీ ఆఫర్‌ వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ మధ్యకాలంలో వరుస పరాజయాలతో డీలాపడ్డ అనూ ఇమ్మాన్యుయేల్‌ 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాపై భారీ ఆశలే పెట్టుకుంది. 

ఇదిలా వుంటే చైతూ హీరోగా నటించిన మరో సినిమా 'సవ్యసాచి' విడుదలకు సిద్ధమవుతోంది.

 

ALSO READ: నా నువ్వే మొదటి రోజు కలెక్షన్లు తెలిస్తే షాక్ అవుతారు