నాగచైతన్య హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'సవ్యసాచి'. మూడు వేరియేషన్స్ ఉన్న లవ్‌స్టోరీస్‌ని ఎంతో హృద్యంగా తెరకెక్కించి, యూత్‌తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్‌నీ మెప్పించిన 'ప్రేమమ్' దర్శకుడు చందూ మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
ఈ చిత్రంలో తమిళ రొమాంటిక్ హీరో మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో మాధవన్‌ది విలన్ పాత్ర అని తెలుస్తోంది. ఆ విలన్ కూడా చాలా చాలా పవర్‌ఫుల్ పాత్రనీ తెలుస్తోంది. చాలా కఠినమైన విలన్ అట. విలన్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటే, హీరో పాత్ర అంతగా ఎలివేట్ అవుతుందనేది ఆడియన్స్‌కి తెలిసిన మంత్రమే. అయితే అంత పవర్‌ఫుల్ విలన్‌గా మాధవన్‌ని చూపిస్తే ఆయన అభిమానులు చూడగలరా?
మాధవన్ మంచి నటుడే. అన్ని రకాల ఎమోషన్స్‌నీ పండించగలడు. అయితే ఆయన్ని రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ హీరోగానే చూడగలం. తమిళ డబ్బింగ్ చిత్రాలతో తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది మాధవన్‌కి. తెలుగులో స్ట్రెయిట్‌గా చేస్తున్న తొలి చిత్రమిది. వస్తూ వస్తూనే ఇంత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో వస్తున్నాడు. మాధవన్‌ని ఎలా యాక్‌సెప్ట్ చేస్తారో ఆడియన్స్ చూడాలిక.
ఇకపోతే క్లాస్ అండ్ రొమాంటిక్ చిత్రాలతోనే ఎక్కువగా సక్సెస్ అందుకున్నాడు నాగచైతన్య. కానీ మాస్ హీరో అనిపించుకోవాలనేది చైతూ కోరిక. అలా ట్రై చేసిన ప్రతీ సారి ఫెయిల్యూరే చవి చూశాడు. మరి ఈ సినిమాలో కూడా మాస్‌నే ఎక్కువ నమ్ముకున్నాడనీ తెలుస్తోంది. అయితే మాస్ ఎలిమెంట్స్‌తో పాటు, ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్లుగా ఉండాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయట ఈ సినిమాలో.
అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కొత్త భామ నిధి అగర్వాల్, చైతూతో జోడీ కడుతోంది.
ALSO READ: నేను చేసిన అతి పెద్ద తప్పు అదే: శర్వానంద్