ENGLISH

#ChaiSamల పెళ్ళి వేడుకలు ముగిశాయి

08 October 2017-12:07 PM

ఇటు అక్కినేని కుటుంబ అభిమానులే గాక అటు యావత్ తెలుగు సినీ అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన పెళ్ళి వేడుకలు నిన్నటితో ముగిశాయి.

మొన్నరాత్రి హిందూ సంప్రాదాయ పద్దతిలో వివాహం జరగగా నిన్న క్రైస్తవ సంప్రాదాయ పద్దతిలో ఘనంగా పెళ్ళి వేడుకలు జరిగాయి. ఈ పెళ్ళి వేడుకల్లో అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు సందడి చేశాయి. దగ్గుబాటి సోదరులు సురేష్ బాబు, వెంకటేష్ లతో కలిసి నాగార్జున చేసిన డాన్సులు మొత్తం పెళ్ళి వేడుకల్లో  హైలైట్ గా నిలిచాయి.

ఇక చైతు-సమంతాల పెళ్ళి ఫోటోలు ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ అవ్వగా వీరి పెళ్ళి రిసెప్షన్ త్వరలోనే హైదరాబాద్ లో జరగనుంది. దీనికి సినీ రాజకీయ రంగాల నుండి ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నట్టు సమాచారం.

ఈ శుభ సందర్భంలో మూడుముళ్ళ బంధంతో ఒక్కటైనా ఈ నూతన జంటకి మా www.iqlikmovies.com తరపున శుబాకాంక్షలు చెబుతున్నాము.

ALSO READ: Qlik Here Wedding Gallery