ENGLISH

Ghost: నాగ్ సినిమా ఓటీటీకే ప‌రిమిత‌మా?

07 July 2022-13:37 PM

సీనియ‌ర్ హీరో.... కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం ఫామ్ లో లేడు. మ‌న్మ‌థుడు 2 డిజాస్ట‌ర్ అయ్యింది. వైల్డ్ డాగ్ ని ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు ఆయ‌న `ది ఘోస్ట్` సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌కుడు. షూటింగ్ పూర్త‌య్యింది. శ‌నివారం టీజ‌ర్‌ని ఆవిష్క‌రిస్తారు. దాంతో ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌కు చిత్ర‌బృందం శ్రీ‌కారం చుట్ట‌బోతోంది. అయితే ఈసినిమాపై ఎలాంటి బ‌జ్ లేక‌పోవ‌డం ద‌ర్శ‌క నిర్మాత‌ల్ని కంగారు పెడుతోంది. నాగ్ గ‌త సినిమాల రిజల్ట్ కూడా... ఇబ్బంది పెట్టే అంశ‌మే.

 

అందుకే ఈ సినిమాని నేరుగా ఓటీటీలోనే విడుద‌ల చేద్దామ‌ని ఫిక్స్ అయ్యార్ట‌. అమేజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ల‌తో.. నిర్మాత‌లు సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని, మంచి బేరం వ‌స్తే, డీల్ ఫిక్స‌వుతుంద‌ని తెలుస్తోంది. అయితే అది కూడా అంత ఈజీకాదు.

 

పెద్ద సినిమాల్ని కొనే ముందు ఓటీటీలు ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచిస్తున్నాయి. అనేక కండీష‌న్లు పెడుతున్నాయి. ఎలాంటి క్రేజ్ లేని సినిమాల్ని అస్స‌లు కొన‌డం లేదు. టీజ‌ర్‌,ట్రైల‌ర్‌తో కాస్త హైప్ వ‌స్తే, ఓటీటీ నుంచి ఆఫ‌ర్లు అందుతాయ‌ని నిర్మాత భావిస్తున్నారు. కాజ‌ల్, సోనాల్ చౌహాన్ క‌థానాయిక‌లుగా న‌టించారు.

ALSO READ: బింబిసార హిట్ట‌యితే... నాలుగేళ్లు బిజీనే!