ENGLISH

అజిత్ సినిమాలో నాగార్జున‌?

02 February 2022-10:00 AM

ద‌ర్శ‌క నిర్మాత‌ల పంథా మారింది. ప్ర‌తీ సినిమానీ వాళ్లు `రిచ్‌`గానే చూస్తున్నారు. ఓ స్టార్ హీరో సినిమాలో .. మ‌రో స్టార్ హీరోని చూపిస్తే ఎంత క్రేజ్ వ‌స్తుందో వాళ్ల‌కు అర్థం అవుతోంది. అందుకే చిన్న పాత్రకైనా స‌రే, స్టార్ ని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. త‌ద్వారా... వెండి తెర‌పై స‌రికొత్త కాంబినేష‌న్ల‌ని చూసే అవ‌కాశం ద‌క్కుతోంది. అందులో భాగంగానే అజిత్ - నాగార్పున కాంబో సెట్ట‌య్యింద‌ని స‌మాచారం.

 

అజిత్ హీరోగా బోనీక‌పూర్ ఓ పాన్ ఇండియా సినిమాని రూపొందిస్తున్నారు. వినోద్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో.. ఓ కీల‌క‌మైన పాత్ర కోసం నాగార్జున‌ని సంప్ర‌దించార‌ని టాక్‌. ప్ర‌స్తుతం చిత్ర‌బృందంతో మంత‌నాలు జ‌రుగుతున్నాయి. అన్నీ ఓకే అనుకుంటే.. ఈ సినిమాలో నాగ్ ఎంట్రీ ఖాయం. ఈ సినిమాలో నాగ్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టించ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక‌వేళ నాగ్ గ‌నుక నో అంటే.. ఆ పాత్ర కోసం మోహ‌న్ లాల్ ని తీసుకోవాలన్న ఆలోచ‌న కూడా ఉంది. కాక‌పోతే... తొలి ఆప్ష‌న్ మాత్రం.. నాగార్జున‌నే. అయితే ఇందులో నాగ్ న‌టిస్తాడా, లేదా? అనేది ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.

ALSO READ: టాలీవుడ్‌కి ఉప్పు అందిందా..?