ENGLISH

మామ నాగ్‌తో క్యూట్‌ కోడలు సమంత

06 October 2017-18:01 PM

కాస్సేపట్లో శామ్‌ మా ఇంటి కోడలు కాబోతోందంటూ నాగార్జున ఈ ఫోటోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. కోడలితో ఈ ఆత్మీయ ఆలింగనానికి అక్కినేని ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. అందమైన అక్కినేని వారి ఫ్యామిలీలోకి కాస్పేపట్లో కోడలుగా సమంత అడుగుపెట్టనుంది. ఈ రోజు గోవాలో అక్కినేని నాగ చైతన్యతో సమంత వివాహం ఘనంగా జరగనుంది. హిందూ సాంప్రదాయంలో ఈ వేడుక జరగనుంది మరికొద్ది గంటల్లో. గోవాలో మెహందీ ఫంక్షన్‌ తదితర కార్యక్రమాలతో ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ సందడి సందడిగా గడుపుతోంది. అక్కినేని ఫ్యామిలీతో పాటు వెంకటేష్‌, రానా తదితరులు కూడా ఈ వేడుకలో ఆనందంగా గడుపుతున్నారు. రేపు అనగా శనివారం క్రిస్టియన్‌ సాంప్రదాయంలో వీరి వివాహం జరగనుంది. గత కొన్నాళ్ళుగా లవ్‌లో ఉన్న ఈ ప్రేమ జంట ఎట్టకేలకు ఈ రోజు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. అందాల సమంత అక్కినేని వారింటి కోడలు కాబోతోంది. త్వరలోనే మామా, కోడలు కలిసి నటించిన 'రాజుగారి గది - 2' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సమంత దయ్యం పాత్రలో నటిస్తోంది. నాగార్జున మెంటలిస్ట్‌ పాత్రలో నటిస్తున్నాడు. పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాల్లో యధావిధిగా నటించనుంది. ప్రస్తుతం ఆమె చేతిలో బిగ్‌ ప్రాజెక్ట్సే ఉన్నాయి. రామ్‌చరణ్‌తో 'రంగస్థలమ్‌' సినిమాలో నటిస్తోంది. తమిళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది సమంత.

ALSO READ: Qlik Here For The #ChaiSam Wedding Gallery