ENGLISH

స‌ర్కారు వారి పాట‌.. ఇది న‌మ్ర‌త వారి మాట‌!

03 June 2020-13:00 PM

మ‌హేష్ బాబు సినిమా అంటే... న‌మ్ర‌త శిరోద్క‌ర్ జోక్యం త‌ప్ప‌ని స‌రి అయిపోతోంది. ఎందుకంటే .. మ‌హేష్‌కి సంబంధించిన అన్ని వ్య‌వ‌హారాల్నీ త‌నే ద‌గ్గ‌రుండి చూసుకుంటోంది. ఏ స‌మ‌యంలో షూటింగులు నిర్వ‌హించాలి? ఎప్పుడు ఏ సినిమాకి డేట్లు ఇవ్వాలి? అనేవ‌న్నీ న‌మ్ర‌త ఆదేశాల అనుసారం సాగుతాయ‌ని ఫిల్మ్ న‌గ‌ర్‌లో పెద్ద టాక్‌. ఆఖ‌రికి హీరోయిన్ల ఎంపిక‌లో కూడా న‌మ్ర‌త జోక్యం ఉంటుంద‌ని అనుకుంటున్నారంతా. తాజాగా `సర్కారు వారి పాట‌` సినిమాలో క‌థానాయిక విష‌యంలోనూ న‌మ్ర‌త చెప్పిన మాటే చెల్లుబాటు అవుతోంద‌ని టాక్‌. మ‌హేష్ బాబు తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌కుడు.

 

ఈ చిత్రంలో క‌థానాయిక గా కైరా అద్వానీ ఎంపికైన‌ట్టు స‌మాచారం. అయితే కైరా ఎంపిక వెనుక న‌మ్ర‌త హ‌స్తం ఉంద‌ట‌. న‌మ్ర‌త చెప్ప‌డం వ‌ల్లే ఈ సినిమాలో కైరాని తీసుకున్నార‌ని తెలుస్తోంది. భ‌ర‌త్ అనే నేను సినిమాలో మ‌హేష్ తో న‌టించింది కైరా. అప్ప‌టి నుంచీ కైరాకీ, న‌మ్ర‌త‌కీ మంచి దోస్తీ కుదిరింది. అందుకే.. కైరాని ఈ ప్రాజెక్టులో తీసుకురావాల‌ని న‌మ్ర‌త ప‌ట్టుబ‌ట్టింద‌ట‌. మ‌హేష్ కూడా స‌రే అన‌డంతో కైరా అద్వాణీకి ఛాన్స్ దొరికేసింది.

ALSO READ: ఎన్టీఆర్ ని ప్ర‌శ్నించిన ప‌వ‌న్ హీరోయిన్‌!