ENGLISH

నందు 'ఇంతలో ఎన్నెన్ని వింతలో' టీజర్ ఎపుడో తెలుసా!

02 June 2017-19:11 PM

హరి హర చలన చిత్ర పతాకం పై హ్యాపెనింగ్ యంగ్ హీరో నందు  హీరోగా, సౌమ్య హీరోయిన్‌గా, స్వామిరారా ఫేమ్ పూజా రామచంద్రన్ కీలక పాత్రలోనూతన దర్శకుడు  వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో  సామంతుల శ్రీకాంత్ రెడ్డి , ఇప్పిలి రామ మోహన రావు నిర్మాతలుగా తెరకెక్కిస్తున్న నూతన చిత్రం "ఇంతలోఎన్నెన్ని వింతలో". దర్శకుడు మాట్లాడుతూ హీరో, ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకొనే తరుణంలో స్నేహితుడు చేసిన చిన్న పొరపాటు ఎటువంటి పరిణామాలకు దారితీసిందో అన్న పాయింట్ ను అత్యంత ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లే తో తెరకెక్కించిన చిత్రం "ఇంతలోఎన్నెన్ని వింతలో". నిర్మాణంతర కార్యక్రమాలు శరవేగంగా జరుపుకొంటున్న ఈచిత్రం టీజర్ ను జూన్ మొదటి వారంలో ప్రముఖ హీరో చేతుల మీదుగా విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ALSO READ: ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్‌ ఆఫ్‌ లేడీస్‌ టైలర్‌ మూవీ రివ్యూ రేటింగ్స్