ENGLISH

బ‌న్నీలా మారిపోయిన నాని

20 March 2022-12:00 PM

నాని హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం ద‌స‌రా. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ని ఆదివారం విడుద‌ల చేశారు. ఇందులో నాని గెట‌ప్ చూసి అంతా ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. అంత మాసీగా ఉంది. నాని ఎప్పుడూ క్లీన్ షేవ్‌తోనే క‌నిపిస్తాడు. ఇస్త్రీ కూడా న‌ల‌గ‌నివ్వ‌డు. అలాంటిది.. ఫుల్ మాసీ లుక్‌లో, గ‌ళ్ల లుంగీ, క‌ట్ బ‌నీన్‌, ఎర్ర చొక్కా, ఒత్తైన జుత్తు, ఫుల్ గ‌డ్డం.. ఇలా త‌న మేకొవ‌ర్ పూర్తిగా మారిపోయింది. నానిని స‌డ‌న్ గా చూస్తే... ఇది నానీనా, పుష్ప‌లో బ‌న్నీనా? అనే సందేహం వ‌స్తుంది. ఈ మేకొవ‌ర్ వెనుక పుష్ప‌ని స్ఫూర్తిగా తీసుకొన్నార‌న్నా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు.

 

శ్రీ‌కాంత్ అనే కుర్రాడు ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సుధాక‌ర్ చెరుకూరి నిర్మాత‌. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కిస్తున్న సినిమా ఇది. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌స్తుతానికి షూటింగ్ మొద‌లైంది. ఫ‌స్ట్ లుక్ అయితే అదిరిపోయింది. ఈ లుక్‌తో ఈ సినిమాపై అంచ‌నాలు ఒకేసారి పెరిగిపోయాయి. కాక‌పోతే ఒక్క‌టే స‌మ‌స్య‌. బ‌న్నీని స్ఫూర్తిగా తీసుకొన్నాడంటే ఫ‌ర్వాలేదు. బ‌న్నీని నాని కాపీ కొట్టాడ‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తాయేమో అన్న‌దే అస‌లు స‌మ‌స్య‌.

ALSO READ: 'డాడీ' ఫ్లాప్‌.. మ‌రి 'బ్రో డాడీ' ఏం చేస్తుందో?