ENGLISH

ఈసారి షాకింగ్ క‌థ‌తో నాని?

13 July 2021-12:08 PM

ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్స్ గా నిలిచాడు నాని. కుటుంబ‌మంతా చూసి ఆస్వాదించేలా నాని సినిమాలు ఉంటాయి. అందుకే త‌న సినిమా అంటే అంత ఆద‌ర‌ణ‌. అయితే త‌న కెరీర్‌లో తొలిసారి.. ఎంట‌ర్‌టైన్మెంట్ అంటూ లేకుండా పూర్తి స్థాయి ఎమోష‌న‌ల్ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. అవును... అందుకు బ్యాక్ గ్రౌండ్ కూడా సెట్ట‌యిపోయింది.

 

నానికి జెర్సీ లాంటి సూప‌ర్ హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి. ఇప్పుడు నానితో మ‌రోసారి చేతులు క‌ల‌ప‌బోతున్నాడ‌ట‌. ఈసారి ఓ డిఫ‌రెంట్ క‌థ‌తో.. నాని ముందుకు వ‌చ్చాడ‌ట‌. ఈ సినిమాలో నాని సైనికుడి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ని టాక్. యుద్ధంలో పాల్గొని, రెండు కాళ్లూ పోగొట్టుకున్న ఓ జ‌వాన్ క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కుతుంద‌ని, ఈచిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కిస్తార‌ని స‌మాచారం అందుతోంది. ప్ర‌స్తుతం టక్ జ‌గ‌దీష్, అంటే సుంద‌రానికి, శ్యామ్ సింగ‌రాయ్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు నాని. ఇవి అయ్యాకే గౌత‌మ్ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది.

ALSO READ: ఓటీటీకే నార‌ప్ప ఓటు... 20న రిలీజ్‌!