ENGLISH

నాని-శర్వాల ముల్టీ స్టారర్?

19 August 2017-15:41 PM

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మల్టీ స్టారర్ ల ట్రెండ్ ఈ మధ్యనే ఉదృతమైన నేపధ్యంలో ఒక సంచలన కాంబో ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది.

 

వివరాల్లోకి వెళితే, దర్శకుడు హరీష్ శంకర్ తాజా చిత్రం ‘దాగుడుమూతలు’ని ప్రముఖ  నిర్మాత అయిన దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇద్దరు హీరోలకి ఈ చిత్రంలో నటించే అవకాశం ఉండడంతో- నాని & శర్వానంద్ లని ఎంపిక చేసుకునే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టు సమాచారం.

ఇప్పటికే ఈ ఇద్దరు హీరోల చేతినిండా సినిమాలు ఉండడంతో త్వరలోనే ఈ దాగుడుమూతలు చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది.  డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ లొకేషన్స్ ని కూడా ఎంపిక చేయడం పూర్తిచేశాడు.

 

ALSO READ: తమిళ రచయత రాసిన తెలుగు పాట