ENGLISH

'ట‌క్ జ‌గ‌దీష్' టీజ‌ర్ విడుద‌ల‌

23 February 2021-18:40 PM

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'టక్ జగదీష్' 2021లో ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. 'నిన్నుకోరి' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది. నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

 

నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 23న ఈ సినిమా విడుద‌ల కానున్న‌ది. ఈ విష‌యాన్ని మంగ‌ళ‌వారం విడుద‌ల చేసిన టీజ‌ర్‌లో వెల్ల‌డించారు.

 

ఫిబ్ర‌వ‌రి 24 నాని బ‌ర్త్‌డే. దానికి ఒక‌రోజు ముందుగానే నాని అభిమానుల‌కు సంబ‌రాన్ని చేకూర్చేలా 'ట‌క్ జ‌గ‌దీష్' టీజ‌ర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.

ALSO READ: తేజ త‌న‌యుడి అరంగేట్రం..?!