విలక్షణ చిత్రాలకు సై అనడంలో ఎప్పుడూ ముందుంటాడు నారా రోహిత్. హిట్, ఫ్లాపులతో అస్సలు సంబంధం లేదు మనోడికి. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ అయితే వెంటనే ఓకే చేసేస్తాడు. అయితే ఒక్క కమర్షియల్ హిట్ పడితే మనోడి దశ తిరిగినట్లే. ఆ హిట్ కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉంటాడు. కింద పడినా మళ్లీ మళ్లీ కొత్త కొత్తగా లేవాలనుకుంటాడు. అదే కొత్త థాట్‌తో మన ముందుకు రాబోతున్నాడు నారా రోహిత్.
ఇప్పుడు హీరోకి 'లోపం'తో సినిమాలు తెరకెక్కడం ట్రెండింగ్ అయిపోయింది. చిన్న హీరో నాని 'మతిమరుపు' లోపంతో స్టార్ట్ అయిన ఈ సక్సెస్ మంత్రం బాగా పాపులర్ అయిపోయింది. అంధత్వం, చెవిటితనం, ఓ చేయి పనిచేయకపోవడం ఇలా తదితర లోపాలు సినిమాల్లో హిట్ ఫార్ములాగా మారాయి. ఇప్పటికే ఈ ఫార్ములాతో తెరకెక్కిన చిత్రాలు సక్సెస్ అందుకోగా, మరికొన్ని చిత్రాలు సక్సెస్ దారిలో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాయి. అంటే త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
అందులో ముందుగా చెప్పుకోదగ్గది రామ్ చరణ్ 'రంగస్థలం'. ఈ సినిమాలో చరణ్ చెవిటివాడిలా నటిస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ అంధుడిలా నటించి, 'రాజా ది గ్రేట్' సినిమాతో ఆల్రెడీ హిట్ కొట్టేశాడు. ఇప్పుడు నారా రోహిత్ విషయానికి వస్తే, మనోడు ఓ సినిమా కోసం మూగోడి అవతారమెత్తబోతున్నాడు. వైష్ణవీ క్రియేషన్స్ బ్యానర్‌లో నారాయణరావు అట్లూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పీబీ మంజునాధ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.
కొత్త సంవత్సరం ఉగాది రోజున ఈ చిత్రం స్టార్ట్ కానుంది. నారా రోహిత్‌కి ఈ సినిమా 18వ చిత్రం కావడం విశేషం.
ALSO READ: కర్తవ్యం తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్స్