ENGLISH

న‌రేష్ కి విల‌న్ గా... న‌వీన్ చంద్ర‌?!

22 July 2021-13:06 PM

అల్ల‌రి న‌రేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం `స‌భ‌కు న‌మ‌స్కారం`. సతీష్ మల్లంపాటి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నాడు. ఇదో పొలిటిక‌ల్ సెటైర్‌. ఇటీవ‌ల న‌రేష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. క‌థానాయ‌కుడిగా న‌రేష్ పేరు త‌ప్ప‌... ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు బ‌య‌ట‌కు రాలేదు. ఇప్పుడు న‌వీన్ చంద్ర కూడా ఈ సినిమాలో న‌టిస్తున్నాడ‌ని తెలుస్తోంది. న‌వీన్ చంద్ర ది నెగిటీవ్ రోల్ అని.. త‌ను ఓ పొలిటిక‌ల్ లీడ‌ర్ గా నటిస్తున్నాడ‌ని స‌మాచారం.

 

`అందాల రాక్ష‌సి`తో న‌వీన్ చంద్ర ఆక‌ట్టుకున్నాడు. ఆ త‌ర‌వాత‌.. త‌న‌కు స‌రైన పాత్ర‌లు రాలేదు. నెగిటివ్ రోల్ చేసినా - గుర్తింపు సంపాదించ‌లేదు. త‌న కెరీర్ ట‌ర్న్ అయ్యే పాత్ర కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. ఎట్ట‌కేల‌కు త‌న ఎదురు చూపులు ఈ సినిమాతో ఫ‌లించాయ‌ని. ఇందులో న‌వీన్ చంద్ర పాత్ర గుర్తుండిపోయేలా ఉంటుంద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సివుంది.

ALSO READ: వెంటిలేట‌ర్‌పై అరియానా... ఏం జ‌రిగింది?