లేడీ సూపర్ స్టార్ గా సౌత్ లో ఒక వెలుగు వెలుగుతోంది నయన తార. కెరియర్ మొదలుపెట్టి ఇన్ని ఏళ్ళు అయినా ఇంకా దూకుడుగా సినిమాలు చేస్తూ, కొత్త వారికి పోటీగా ఉంది. జవాన్ తో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి బిగెస్ట్ హిట్ కొట్టింది. దీనితో ఈ అమ్మడికి తిరుగు లేకుండా పోయింది. జవాన్ మూవీ తరవాత బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ ఆఫర్స్ వచ్చినా, వద్దనుకుంది. అదేంటి బాలీవుడ్ ఆఫర్స్ కి నో చెప్తోంది అనుకున్నారంతా. కానీ నయన్ రూటే సెపరేట్. కమర్షియల్ సినిమాలో నటిస్తూ, ఎదో రెండు మూడు పాటలకి హీరో పక్కన కనిపించటం కంటే లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ, సింగిల్ గా పేరు పొందటం బెటరని అమ్మడి భావన.
ఈ ఆలోచనతోనే లేడి ఓరియెంటెడ్ సినిమాలని లైన్ లో పెట్టింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది. నయన్ ఒప్పుకుంటున్న కొత్త ప్రాజెక్ట్స్ చూస్తుంటే మతి పోతోంది. సెట్స్ లో ఉన్న సినిమాలు కాకుండా ఇంకా కొత్త సినిమాలుకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, సంతకాలు చేస్తోంది. లేడీ ఓరియేంటెడ్ అయితే చాలు ఏ కథని విడిచి పెట్టడం లేదు. టైం కేటాయించి వాటిని వినటం, నచ్చితే ఒకే చెప్పటం, నచ్చకపోతే మార్పులు చెప్పటం చేస్తోందట. అంతేగానీ ప్రాజెక్ట్ మాత్రం వదులుకోవడం లేదని టాక్. నయన్ కొత్తగా వింటున్న కథలు, సంతకాలు చేసినవి కాకుండా, సెట్స్ పై ఏకంగా 11 సినిమాలున్నట్లు సమాచారం.
పాత తరం హీరోలు ఇలా ఒకేసారి ఇన్ని సినిమాలకి కమిట్ అయ్యి, షూటింగ్స్ లో పాల్గొనేవారు. ఈ జనరేషన్ లో ఇలా ప్రస్తుతం నయన్ కి మాత్రమే చెల్లింది. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో మొత్తం 11 సినిమాలు షూటింగ్స్ జరుగుతున్నాయి. ఇందులో 'టెస్ట్' సినిమా షూటింగ్ కంప్లీట్అయింది. మన్నాగట్టై సిన్స్ 1960 , డియర్ స్టుండెట్స్, మమ్ముట్టి GVM ఫిల్మ్, తని ఒరువన్-2 , ఎన్టీ 81, గుడ్ బ్యాడ్ అగ్లీ, విష్ణు యదువన్ సినిమా, టాక్సిక్, మోకుత్తై అమ్మాన్ -2, సర్జన్ కె.ఎమ్ ఫిల్మ్, మహారాణి చిత్రాలు చేస్తోంది. ఇవన్నీ ప్రజంట్ ఆన్ సెట్స్ లో ఉన్నాయి. ఇవి కాక లేడీ ఓరియేంటెడ్ సినిమాలు ఇంకో మూడు లాక్ చేసినట్లు సమాచారం.