ENGLISH

Madhavan: మాధ‌వ‌న్‌తో జోడీ క‌ట్ట‌నున్న న‌య‌న్‌

12 November 2022-11:00 AM

న‌య‌న‌తార స్ట్రాట‌జీ విచిత్రంగా ఉంటుంది. స్టార్ హీరోలు వెంట ప‌డుతున్నా సినిమాలు ఒప్పుకోదు. పారితోషికంతో బెంబేలు ఎత్తిస్తుంటుంది. ఒక్కోసారి చిన్నా చిత‌కా హీరోల సినిమాల‌కు, సెకండ్ గ్రేడ్, టూ టైర్ హీరోల‌కు ఓకే చెప్పేస్తుంటుంది.

 

ఇప్పుడూ అదే చేసింది. మాధ‌వ‌న్ తో ఓ సినిమా చేయ‌డానికి న‌య‌న అంగీక‌రించింది. శ‌శికాంత్ ద‌ర్శ‌క‌త్వంలో మాధ‌వ‌న్ హీరోగా ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో సిద్దార్థ్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో క‌థానాయిక‌గా న‌య‌న‌తార న‌టించ‌బోతోంది. ఇందుకు సంబంధించిన ఒప్పంద ప‌త్రాల‌పై న‌య‌న సంతకాలు చేసింది. ఇది పాన్ ఇండియా ప్రాజెక్టు. అన్ని భాష‌ల్లోనూ ఒకేసారి విడుద‌ల కానుంది.

 

ఈ సినిమా కోసం న‌య‌న రూ.4 కోట్ల పారితోషికం అందుకోబోతున్న‌ట్టు టాక్‌. రూ.4 కోట్లు తీసుకొంటున్నా న‌య‌న ఈ సినిమాకి కేటాయింని కాల్షీట్లు 30 మాత్ర‌మే అట‌. అంటే.. న‌య‌న‌కు పారితోషికం బాగా గిట్టుబాటు అయిన‌ట్టే. మ‌రోవైపు షారుఖ్ ఖాన్ తో జ‌వాన్ అనే సినిమాలో న‌టించింది న‌య‌న‌. అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల కాబోతోంది.

ALSO READ: Yashoda Review: 'యశోద'మూవీ రివ్యూ &రేటింగ్