నయనతార పెళ్లి - సోషల్ మీడియాలో ఎక్కువ సార్లు వైరల్ అయిన పాయింట్ ఇదే. 2020 కరోనా సమయంలో కూడా.. నయన్ పెళ్లి వార్తల్లో నిలుస్తూనే ఉంది. దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయనతార ప్రేమలో పడడం, కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్య ఇద్దరూ జంటగానే కనిపిస్తున్నారు. ఇద్దరికీ పెళ్లయిపోయిందన్న వార్తలూ వచ్చాయి. అయితే.. నిజంగా, ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నార్ట. ఈ యేడాది ఫిబ్రవరిలో నయన - విఘ్నేష్ పెళ్లి ఖాయమని సమాచారం.
ఈ మేరకు ఇరు కుటుంబ సభ్యులూ ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఇద్దరి పెళ్లీ చెన్నైలోనే, ఓ చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరుగుతుందని వార్తలొస్తున్నాయి. నయన, విఘ్నేష్ త్వరలోనే ఈ పెళ్లికబురు తమ అభిమానులతో పంచుకుంటార్ట. పెళ్లి కూడా సింపుల్ గా జరుగుతుందని, పెద్దగా హడావుడి చేయరని సమాచారం. మరి.. ఈసారైనా.. ఈ పెళ్లి వార్తలకే పరిమితం అవుతుందా? లేదంటే... నిజంగానే పెళ్లి చేసుకుని షాక్ ఇస్తారా? అనేది చూడాలి.
ALSO READ: Nayanthara Latest Photoshoot