ENGLISH

ప్రియుడికి బర్త్‌డే గిఫ్ట్‌: నయనానందకరం

19 September 2017-15:24 PM

నయనతార లవ్‌ స్టోరీ ఎప్పటికప్పుడే సెన్సేషన్‌. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళ డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉందని గత కొంత కాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ పుట్టినరోజు సోమవారం. అంటే నిన్న. ప్రియుని పుట్టినరోజు వేడుకను ప్రియురాలు నయనతార స్పెషల్‌గా సెలబ్రేట్‌ చేసింది. న్యూయార్క్‌లో నయనతార ఈ పుట్టినరోజును నిర్వహించింది. ఈ సందర్భంగా ఈ ప్రేమికులిద్దరూ క్లోజ్‌గా ఉన్న ఫోటోలను డైరెక్టర్‌ విఘ్నేష్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇంత అద్భుతమైన బర్త్‌డే గిప్ట్‌ ఇచ్చినందుకు విఘ్నేష్‌ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. నా జీవితంలో ఇలాంటి బర్త్‌డే ఉంటుందని ఊహించలేదు. ఈ జీవితాన్ని ఇంత అందంగా తయారుచేసిన దేవుడికి, నా ప్రియమైన సన్‌షైన్‌ (నయనతార )కి నా ధన్యవాదాలు' అంటూ ఆయన పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం నయనతార చేతిలో రెండు భారీ ప్రాజెక్టులున్నాయి తెలుగులో. ఒకటి 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో చిరంజీవితో నటిస్తోంది. మరోటి బాలయ్యతో కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలోనూ నయన్‌ నటిస్తోంది. తమిళంలో బిజీ బిజీ ప్రాజెక్టులెన్నో నయన్‌ చేతిలో ఉన్నాయి. ఎంత మంది హీరోయిన్స్‌ ఉన్నా, నయన్‌కి ఉన్న క్రేజ్‌ మాత్రం తగ్గట్లేదు. ఇటు తెలుగులోనూ తమిళంలోనూ మోస్ట్‌ బిజీయెస్ట్‌ హీరోయిన్‌ నయనతార అని చెప్పక తప్పదు.

ALSO READ: ఎన్టీయార్‌ మెచ్చిన డాన్సర్‌ అల్లు అర్జున్‌