తంతే బూరెల బుట్టలో పడతారంటారు కదా... అలా అయ్యింది భీమ్లా నాయక్ పరిస్థితి. ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారంతో పెద్ద సినిమాలన్నీ అసంతృప్తిగా ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ సినిమాల్ని అడ్డుకోవడానికి ఏపీలో వైకాపా నేతలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వకీల్ సాబ్ కి అవాతరాలు కలిగించిన వైకాపా... ఇప్పుడు భీమ్లా నాయక్ ని ఏదోలా అడ్డుకోవాలని చూస్తోంది. అందుకే చిత్రబృందం... ఓటీటీవైపు కూడా దృష్టి సారించింది. జనవరి 12న ఈసినిమాని థియేటర్లలో విడుదల చేయడానికి పవన్ రెడీగా ఉన్నా, నిర్మాతలు సెకండ్ ఆప్షన్ కూడా ఆలోచిస్తున్నారు.
నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాని హోల్ సేల్ గా.. 225 కోట్లకు కొనడానికి ముందుకొచ్చిందని సమాచారం. ఇది నిజంగా కనీవినీ ఎరుగని బ్రహ్మాండమైన ఆఫర్. 225 కోట్లకు ఈ సినిమా అమ్మేస్తే... నిర్మాతలకు భారీ లాభాలు వస్తాయి. పైగా రిస్క్ జీరో. అయితే ఈ విషయం ఓ జనసేన నేత నుంచి బయటకు వచ్చింది. ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సదరు జనసేన నేత.. ఈ ఓటీటీ ఆఫర్ గురించి ప్రస్తావించాడు. అయితే అది ఎంత వరకూ నమ్మశక్యం అనేది మాత్రం తెలీదు. ఇది వరకు భీమ్లా నాయక్ కి 150 కోట్ల వరకూ బేరం వచ్చిన మాట నిజమే. 225 కోట్లంటే కళ్లు మూసుకుని ఇచ్చేయవచ్చు. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్ని రోజలు ఆగాలి.
ALSO READ: పార్టీ మూడ్ లో 'అఖండ'... బాలయ్యని ఖుషీ చేసిన దిల్ రాజు