ENGLISH

టాలీవుడ్‌ కోసం బాలీవుడ్‌ దిగి వస్తోంది

03 October 2017-13:45 PM

బాలీవుడ్‌ నుండి ముద్దుగుమ్మలు టాలీవుడ్‌కి దిగుమతి కావడం కొత్తేం కాదు. కానీ స్టార్‌ హీరోయిన్లు కూడా ప్రస్తుతం టాలీవుడ్‌ సినిమాల్లో నటించేందుకు ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అయిన శ్రద్ధా కపూర్‌ 'సాహో' సినిమాలో నటిస్తోంది. ప్రబాస్‌తో జత కడుతోంది. సూపర్‌ స్టార్‌ మహేష్‌ కోసం కియారా అలియా అద్వానీ భామ దిగి వచ్చింది. కొరటాల శివ - మహేష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'భరత్‌ అను నేను' సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. తాజాగా మరో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌ కూడా టాలీవుడ్‌కి దూసుకొస్తోందట. టైగర్‌ ష్రాఫ్‌తో ఏమున్నా మైఖేల్‌లి చిత్రంలో నటించింది ఈ ముద్దుగుమ్మ. లేటెస్టుగా అక్కినేని బుల్లోడు నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సవ్యసాచి' సినిమా కోసం ఈ ముద్దుగుమ్మని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. మంచి రెస్పాన్స్‌ వచ్చింది ఆ లుక్‌కి. ఇదో ప్రయోగాత్మక చిత్రం. ఎడమ చేయి పని చేయని కుర్రాడి గెటప్‌లో నటిస్తున్నాడు నాగ చైతన్య ఈ సినిమాలో. టైటిల్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. క్యారెక్టర్‌ మరీ ఆశక్తికరంగా ఉంది. చందూ మొండేటి ఏం మ్యాజిక్‌ చేస్తాడో ఈ సినిమాతో చూడాలి మరి. తమిళ రొమాంటిక్‌ హీరో మాధవన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరో పక్క చైతూ, ముద్దుగుమ్మ సమంతల వివాహం దగ్గర్లోనే ఉంది. ఈ నెల 6న వీరి వివాహం గోవాలో ఘనంగా జరగనుంది.

ALSO READ: చైతు-సామ్ పెళ్ళికి నో ఎంట్రీ?!