ENGLISH

Nidhi Agarwal: ఈ హీరోయిన్‌ సుడి మామూలుగా లేదు!

16 March 2023-13:19 PM

చిత్ర‌సీమ‌లో ప్ర‌తిభ కంటే అదృష్టానికే పెద్ద పీట‌. ఎవ‌రి సుడి బాగుంటే... వాళ్ల‌నే అవ‌కాశాలు వెదుక్కొంటూ వ‌స్తాయి. ఇప్పుడు నిధి అగ‌ర్వాల్ ప‌రిస్థితి కూడా ఇంతే. ఈ అమ్మ‌డికి ఒక్క‌టంటే ఒక్క‌టీ సాలీడ్ హిట్ లేదు. కాక‌పోతే.. ఛాన్సుల‌కు కొద‌వ లేకుండా పోతోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ హ‌రి హ‌ర వీర‌మ‌ల్లులో న‌టిస్తోంది నిధి అగ్వార‌ల్. దాంతో పాటుగా ప్ర‌భాస్ సినిమా కూడా ఒప్పుకొంది. ప్ర‌భాస్‌, ప‌వ‌న్‌.. ఇద్ద‌రూ టాప్ స్టార్లే. వీళ్ల ప‌క్క‌న అవ‌కాశాలు రావ‌డం మామూలు విష‌యం కాదు.కెరీర్ లో ఒక్క సాలీడ్ హిట్ కూడా లేని, నిధి అగ‌ర్వాల్ ఇలా రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఏక కాలంలో చేయ‌డం సుడి కాక‌పోతే మ‌రేమిటి?

 

అయితే.. ఇక్క‌డితో ఆగిపోలేదు. ఇప్పుడు తాజాగా మ‌రో మూడు కొత్త సినిమాల్ని ఒప్పుకొంద‌ట నిధి. అందులో రెండు సినిమాల్లో పెద్ద హీరోలే న‌టిస్తార‌ని టాక్‌. పారితోషికం అందుబాటులో ఉంచ‌డం, అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు వెనుకంజ వేయ‌క‌పోవ‌డం ఒక ఎత్త‌యితే, చిత్ర‌సీమ‌లో క‌థానాయిక‌ల కొర‌త మ‌రో ఎత్తు. ఇవ‌న్నీ క‌లిసే... నిధి అగ‌ర్వాల్ కు సినిమాలు క‌ట్ట‌బెబుతున్నాయి. మ‌రి ఈసారైనా నిధికి హిట్టు ప‌డుతుందో లేదో చూడాలి.