ENGLISH

గ్లామ్‌షాట్‌: స్పైసీ లుక్స్‌లో 'పులి' పిల్ల.!

27 January 2020-16:30 PM

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో 'పులి' సినిమాలో నటించిన బొద్దుగుమ్మ.. సారీ సారీ ముద్దుగుమ్మ నికీషా పటేల్‌ గుర్తుంది కదా. సక్సెస్‌ అందుకోలేకపోయింది కానీ, నెట్టింట్లో పాప కావల్సినంత పాపులారిటీ సంపాదించుకుంది. అందుకు కారణం బికినీ షోలే. వరుసగా బికినీలో స్కిన్‌ షో చేసి, కుర్రకారును ఉర్రూతలూగించేసిందీ అమ్మడు. మొదట్లో కాస్త బొద్దుగా ఉన్నా, కష్టపడి వర్కవుట్స్‌ చేసి, ఒళ్లు బాగా తగ్గించింది. కత్తిలాంటి ఫిగర్‌తో, యూత్‌ని గిలిగింతలు పెడుతోంది. అయితే, తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు. కానీ, అప్పుడెప్పుడో 'గుంటూర్‌ టాకీస్‌ 2' సినిమాకి హీరోయిన్‌గా ఎంపికైంది. ఆ సినిమా స్టేటస్‌ ఏంటనేది మాత్రం తెలియ రాలేదు. అయితే, తమిళంలో వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. అరడజనుకు పైగా సినిమాల్లో నటిస్తోంది.

నికీషా నటించిన సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజవుతూ వస్తున్నాయి. మొన్నీమధ్యనే 'మార్కెట్‌ రాజా' అనే సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. వెరీ లేటెస్ట్‌గా ఓ హాట్‌ ఫోటో షూట్‌ చేయించుకుంది. స్కిన్‌ కలర్‌ చెమ్కీ డ్రస్‌లో డిఫరెంట్‌ పోజిచ్చింది. హెయిర్‌ని టైట్‌గా పోనీ చేయడంతో, ముఖం కొంచెం ముదురుగా కనిపిస్తున్నా, పిక్‌లో కావల్సినంత గ్లామర్‌ కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ నడుం భాగం మతి పోగొట్టేస్తోంది.

ALSO READ: Nikesha Patel Hot Photoshoot