ENGLISH

నితిన్‌ కాదు, నిఖిల్‌ ఫిక్సయ్యాడు.!

03 February 2020-09:00 AM

గత కొన్ని రోజులుగా హీరో నితిన్‌కి పెళ్లంట.. డెస్టినేషన్‌ పద్థతిలో ఇప్పటికే దుబాయ్‌లో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయట.. అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. నితిన్‌ ఇంట్లో పెళ్లి బాజా సంగతేమో కానీ, మీడియా మాత్రం తెగ డప్పు కొట్టేసింది నితిన్‌ పెళ్లి విషయంలో. ఇంత జరుగుతున్నా నితిన్‌ నుండి ఎలాంటి సమాచారం అందలేదు. ఇది సరే, మరో యంగ్‌హీరో నిఖిల్‌ సిద్దార్ధ్‌ మాత్రం సైలెంట్‌గా తను ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్ధం చేసుకుని, పెళ్లి డేట్‌ కూడా ఫిక్స్‌ చేసేసుకున్నాడు. ఫిబ్రవరి 1న గోవాలో సినీ ఫక్కీలో నిశ్చితార్ధం చేసుకున్న నిఖిల్‌, ఏప్రిల్‌ 16న ఓ ఇంటి వాడు కానున్నాడు.

 

భీమవరం అమ్మాయి పల్లవి వర్మను గత కొన్నాళ్లుగా నితిన్‌ ప్రేమిస్తున్నాడు. వృత్తి పరంగా డాక్టర్‌ అయిన పల్లవితో, మన యాక్టర్‌ నిఖిల్‌ కొన్నేళ్ల క్రితం గోవాలో లవ్‌ ప్రపోజ్‌ చేశాడు. ఆ లవ్‌ ఇప్పుడు పెద్దల వరకూ చేరి, పెళ్లి పీటలెక్కింది. అయితే, తాను ప్రపోజ్‌ చేసిన ప్లేస్‌లోనే నిఖిల్‌ డిఫరెంట్‌ యాంగిల్‌లో నిశ్చితార్ధ వేడుకలు జరుపుకున్నాడు. గోవా బీచ్‌ ఒడ్డున రీల్‌ హీరో, హీరోయిన్స్‌లా ఈ ఇద్దరూ నిశ్చితార్ధం చేసుకున్నారు. ఈ ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం నిఖిల్‌ 'కార్తికేయ 2' సినిమాలో నటిస్తున్నాడు. నిఖిల్‌ హీరోగా 'శ్వాస' అను మరో సినిమా కూడా సెట్స్‌పై ఉంది. ఇటీవలే 'అర్జున్‌ సురవరం' సినిమాతో నిఖిల్‌ సూపర్‌ హిట్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ALSO READ: సర్వర్ సుందరం ఫిబ్రవరి 14న విడుదల !!