ENGLISH

నితిన్ నామ సంవ‌త్స‌రం

20 February 2021-12:05 PM

యంగ్ హీరోలు ఎంత బిజీగా ఉండి, ఎన్ని సినిమాలు చేయ‌గ‌లిగితే అంత క‌ళ‌. ఎందుకంటే... పెద్ద హీరోలు సంవ‌త్స‌రానికి ఒక‌టీ, అరా సినిమాతోనే స‌రిపెడ‌తారు. యూత్ కాస్త స్పీడు స్పీడుగా సినిమాలు చేస్తేనే... బాక్సాఫీసు క‌ళ‌క‌ళ‌లాడుతుంటుంది. నాని, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, శ‌ర్వానంద్ లాంటివాళ్లంతా జోరుగానే సినిమాలు చేస్తున్నారు. నితిన్ కూడా ఈమ‌ధ్య స్పీడు పెంచాడు. 2021లో త‌న సినిమాలు మూడు రాబోతున్నాయి.

 

ఫిబ్ర‌వ‌రి 26న `చెక్‌` రాబోతోంది. చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. దీనిపై చాలా అంచ‌నాలున్నాయి. మార్చి 26న `రంగ్ దే` వ‌స్తోంది. కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టించింది. ఇదో ల‌వ్ స్టోరీ. జూన్ 11న నితిన్ నుంచి మ‌రో సినిమా రాబోతోంది. బాలీవుడ్ లో ఘ‌న విజ‌యం సాధించిన అంధాధూన్‌ని రీమేక్ ఇది. టైటిల్ ఇంకా నిర్ణ‌యించ‌లేదు. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌కుడు. త‌మ‌న్నా, న‌భా న‌టేషా కీల‌క పాత్ర‌ధారులు. ఆ సినిమా పూర్త‌య్యేలోగా నితిన్ మ‌రో రెండు కొత్త సినిమాల‌కు సంత‌కాలు పెట్టే అవ‌కాశం వుంది.

ALSO READ: ఆ సినిమా హిట్టు.. వెంకీ హ్యాపీ!