ENGLISH

NTR, Nayanthara: న‌య‌న‌కు క‌వ‌ల‌లు.. ఎన్టీఆర్‌ ముందే చెప్పాడు

11 October 2022-11:00 AM

ఈ మీమ్స్ చేసే వాళ్లున్నారు క‌దా.. వాళ్ల టైమింగే.. టైమింగు. వీడియోలు ఎక్క‌డ నుంచి ప‌డ‌తారో గానీ, టైమింగ్ కి త‌గ్గ‌ట్టుగా సూట‌య్యే క్లిప్పింగ్స్ ప‌ట్టేసి, క‌రెంట్ ఎఫైర్స్ తో లింకు పెట్టేస్తారు. దాంతో బోలెడంత కామెడీ, కాల‌క్షేపం పుట్టుకొచ్చేస్తుంటాయి.

 

ఇప్పుడు న‌య‌న‌తార విష‌యంలోనూ అదే జ‌రిగింది. న‌య‌న ఇద్ద‌రు క‌వ‌ల పిల్ల‌ల‌కు అమ్మ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని న‌య‌న భ‌ర్త‌ విఘ్నేశ్ ఆదివారం సోష‌ల్ మీడియాలో అధికారికంగా ధృవీక‌రించాడు. న‌య‌న‌కు క‌వ‌ల పిల్ల‌లు అనే సంగ‌తి తెలియ‌గానే... ఓ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

 

అదుర్స్ లో న‌య‌న‌తార - ఎన్టీఆర్ మ‌ధ్య సంభాష‌ణ‌ని బ‌య‌ట‌కు లాగారు. అందులో.. ''ఎడం న‌డుం మ‌డ‌త‌లో పుట్టుమ‌చ్చ ఉంది...మీకు క‌మ‌ల పిల్ల‌లు పుడ‌తారు.. మ‌చ్చ శాస్త్రం చెబుతోంది'' అంటూ న‌య‌న‌తో చారి చెప్పిన డైలాగు ఇప్పుడు మ‌రింత వైర‌ల్ అవుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ వీడియోని వైర‌ల్ చేస్తూ.. `మా ఎన్టీఆర్ అన్న ఎప్పుడో చెప్పాడు చూశారా` అంటూ కామెంట్లు జోడిస్తున్నారు.

మ‌నం ఏం మాట్లాడుకొన్నా - త‌ధాస్తు అన‌డానికి దేవ‌త‌లు ఉంటారు అంటుంటారు. అది ఇదేనేమో..?

ALSO READ: నయ‌న‌తార స‌రోగ‌సీ చ‌ట్ట‌బ‌ద్ద‌మేనా?