ENGLISH

బ‌న్నీ క‌థే... ఎన్టీఆర్ చేస్తున్నాడా?

30 April 2021-14:00 PM

`ఆచార్య‌` త‌ర‌వాత‌.. అల్లు అర్జున్ తో కొర‌టాల శివ ఓ సినిమా చేయాలి. అందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. అయితే స‌డ‌న్ గా ఎన్టీఆర్ తో ప్రాజెక్టు ఓకే అయ్యింది కొర‌టాల‌కు. త్రివిక్ర‌మ్ తో ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా వెన‌క్కి వెళ్ల‌డంతో - కొర‌టాల‌తో జ‌ట్టు క‌ట్టాడు ఎన్టీఆర్‌.`ఆచార్య‌` అయిన వెంట‌నే... ఎన్టీఆర్ సినిమా మొద‌లెట్టాలి. దాంతో కొర‌టాల‌కు అర్జెంటుగా ఓ క‌థ అవ‌స‌రమైంది. అందుకే... బ‌న్నీ కోసం రాసిన క‌థే, ఇప్పుడు ఎన్టీఆర్ తో చేసేస్తున్నాడ‌ని టాక్‌.

 

ఈ విష‌యాన్ని కొర‌టాల స‌న్నిహితులు కూడా చూచాయిగా చెప్పేస్తున్నారు. బ‌న్నీ కోసం ఓ కాలేజీ బ్యాక్ డ్రాప్ క‌థ‌ని రాసుకున్నాడు కొర‌టాల‌. ఇప్పుడు ఎన్టీఆర్ నీ కాలేజీ స్టూడెంట్ గానే చూపిస్తున్నాడ‌ట‌. దాంతో బ‌న్నీ క‌థే.. ఎన్టీఆర్‌కి ఫిక్స‌య్యింద‌న్న ఊహాగానాల‌కు మ‌రింత బ‌లం వ‌చ్చిన‌ట్టైంది.

 

అయితే ఇక్క‌డే ఓ ట్విస్టు కూడా ఉంది. అల్లు అర్జున్ - కొర‌టాల సినిమా పూర్తిగా ఆగిపోలేద‌ని 2022లో త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని నిర్మాత‌లు చెప్పారు. ఆ క‌థే.. ఇప్పుడు ఎన్టీఆర్ తో తీస్తున్నాడంటే.. బ‌న్నీ సినిమా ఉంటుందా, లేదంటే పూర్తిగా ఆగిపోయిందా? అనే అనుమానాలు పెరుగుతున్నాయిప్పుడు. ఏం జ‌రుగుతుందో చూడాలి.

ALSO READ: పాపం.. సిద్దూని టార్గెట్ చేశారు