ENGLISH

మాఫియా డాన్‌... ఎన్టీఆర్‌!

20 September 2020-13:12 PM

కేజీఎఫ్ త‌ర‌వాత‌... ప్ర‌శాంత్ నీల్ రేంజే మారిపోయింది. టాలీవుడ్ స్టార్లంతా.. ప్ర‌శాంత్ తో సినిమా చేయ‌డానికి పోటీ ప‌డ్డారు. మ‌హేష్‌, ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌.. వీళ్లంతా ప్ర‌శాంత్ నీల్ కి ట‌చ్ లోకి వెళ్లారు. చివ‌రికి ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌ల‌తో సినిమాలు ఓకే చేసుకున్నాడు ప్ర‌శాంత్‌. ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ కాంబోలో... మైత్రీ మూవీస్ ఓ సినిమా ఫిక్స్‌చేసింది. ఇందులో ఎన్టీఆర్ పాత్రేమిటి?? అన్న‌ది ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

 

ఈ సినిమాలో ఎన్టీఆర్ మాఫియా డాన్ గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఓ అనాథ‌... మాఫియా సామ్రాజ్యంలో తిరుగులేని రారాజుగా ఎలా ఎదిగాడ‌న్న పాయింట్ పై ప్ర‌శాంత్ నీల్ ఈ స‌బ్జెక్ట్ త‌యారు చేసిన‌ట్టు బోగ‌ట్టా. నిజానికి గాడ్ ఫాద‌ర్ లైన్ ఇది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని చాలా సినిమాలొచ్చాయి. అయితే ఆ క‌థ‌కు.. ప్ర‌శాంత్ కొత్త కోటింగ్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది. ఓ ర‌కంగా కేజీఎఫ్ కూడా ఇలాంటి క‌థే.

 

మ‌ళ్లీ అదే పాయింట్ తో... ఈ స్క్రిప్టు రాసుకున్నాడ‌న్న‌మాట‌. బ‌యోవార్ నేప‌థ్యంలో సాగే క‌థ ఇదంటూ.. మ‌రో ప్ర‌చారం జోరుగా సాగుతోంది. కానీ.. నేప‌థ్యం ఏదైనా స‌రే, ఇందులో ఎన్టీఆర్ మాత్రం మాఫియా డాన్ గా క‌నిపించ‌డం ఖాయం అంటున్నారు టాలీవుడ్ జ‌నాలు.

ALSO READ: మోడీజీ... న‌న్ను ర‌క్షించండి: పాయల్ ఘోష్