ENGLISH

NTR, Ram Charan: ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ దోబూచులాట‌

23 November 2022-11:39 AM

ఉప్పెన‌తో సూప‌ర్ హిట్టు కొట్టాడు బుచ్చిబాబు. అయితే ఆ త‌ర‌వాత ఏమిటి? అనేదే పెద్ద ప్ర‌శ్న‌. ఉప్పెన లాంటి హిట్టు ఇచ్చినా.. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కూ ఖాళీగానే ఉన్నాడు. మొన్న‌టి వ‌ర‌కూ ఎన్టీఆర్ తో సినిమా ఫిక్స‌య్యింద‌న్నారు. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ పేరు వినిపిస్తోంది. కొర‌టాల శివ ప్రాజెక్టుతో ఎన్టీఆర్ బిజీ అయ్యాడు కాబ‌ట్టి... బుచ్చిబాబు చ‌ర‌ణ్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోయాడ‌ని, బుచ్చి - చ‌రణ్‌ల కాంబో ఆల్మోస్ట్ ఫిక్స్ అని టాక్‌.

 

నిజానికి చ‌ర‌ణ్‌కి కూడా బుచ్చిబాబు ఓ క‌థ చెప్పాడు. అది చ‌ర‌ణ్‌కి కూడా న‌చ్చింది. కాక‌పోతే.. చ‌ర‌ణ్ ఇప్ప‌టికిప్పుడు ఈ సినిమాని ప‌ట్టాలెక్కించ‌లేడు. అందుకోసం 2023 మార్చి వ‌ర‌కూ ఆగాలి. అప్ప‌టి వ‌ర‌న‌కూ బుచ్చి ఖాళీనే. మ‌రోవైపు ఎన్టీఆర్ కూడా `కంగారు ప‌డ‌కు.. మనం సినిమా చేద్దాం` అని భ‌రోసా ఇస్తున్నాడ‌ట‌. 2023 మార్చి వ‌ర‌కూఆగినా, చ‌ర‌ణ్ డేట్లు ఇవ్వ‌క‌పోతే త‌న ప‌రిస్థితి ఏమిటి? అంటూ... బుచ్చి ఆలోచిస్తున్నాడ‌ట‌. అంటే ఇప్పుడు చ‌ర‌ణ్ ని న‌మ్మి ఎన్టీఆర్‌ని వ‌దిలేయాలా? చ‌ర‌ణ్‌పై డౌటుతో ఎన్టీఆర్ తోనే ట్రావెల్ చేయాలా? అనే విష‌యం తేల‌క స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ట్టు స‌మాచారం. ఈ విష‌యంలో బుచ్చి ఏదీ తేల్చుకోలేక‌పోతున్నాడ‌ని, ఆ కార‌ణంతో.. త‌న ప్రాజెక్టు మ‌రింత డిలే అవుతోంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌.

ALSO READ: 'హిట్ 2' ట్రైల‌ర్.!