ENGLISH

ఎన్టీఆర్ రెడీ... ఇక క్లాప్ కొట్ట‌డ‌మే ఆల‌స్యం

02 June 2020-13:00 PM

చిత్ర‌సీమ ఇప్పుడు మెల్ల‌మెల్ల‌గా ఊపిరి పీల్చుకుంటోంది. షూటింగుల‌కు అనుమ‌తులు ల‌భించ‌డంతో... ఈవారంలోనే కొన్ని సినిమాలు సెట్స్‌పైకి వెళ్ల‌నున్నాయి. అంద‌రికంటే ముందుగా `ఆర్‌.ఆర్‌.ఆర్` షూటింగ్ మొద‌ల‌య్యే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. ఈ వారంలోనే `ఆర్‌.ఆర్‌.ఆర్‌` సెట్స్‌పైకి వెళ్ల‌నున‌న్న‌ద‌ని టాలీవుడ్ టాక్‌.

 

ప‌రిమిత‌మైన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌తో షూటింగ్ చేసుకోవ‌చ్చ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అందుకు సంబంధించిన విధి విధానాల‌ను సైతం రూపొందించింది. వాటిపై ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చిన వెంట‌నే షూటింగులు మొద‌ల‌వుతాయి. ఆ గైడ్ లైన్స్‌ను పాటిస్తూనే `ఆర్‌.ఆర్‌.ఆర్‌` షూటింగ్ మొద‌లెట్టాల‌ని రాజ‌మౌళి భావిస్తున్నాడ‌ట‌. ముందుగా ఎన్టీఆర్‌పై కొన్ని సోలో సీన్లు చేయాల‌ని రాజ‌మౌళి ప్లాన్‌. ఎన్టీఆర్ పుట్టిన రోజుకు ఎలాగూ... టీజ‌ర్ ని విడుద‌ల చేయ‌లేదు. త్వ‌ర‌లోనే టీజ‌ర్ చూపిస్తా.. అంటూ ఎన్టీఆర్ అభిమానుల‌కు మాటిచ్చాడు రాజ‌మౌళి. అందుకే... ఇప్పుడు ఆ ప‌నిలో ఉన్నాడ‌ట‌. షూటింగ్ కోసం ఎన్టీఆర్ కూడా అన్ని విధాలా సిద్ధం అవుతున్నాడ‌ని తెలుస్తోంది. ఇక క్లాప్ కొట్ట‌డ‌మే ఆల‌స్యం.

ALSO READ: స‌మంతకి షాకిచ్చిన ఫ్యాన్.