ENGLISH

రాజుగారి గ‌దిలో ఇరుక్కుపోయిన ఓంకార్‌

15 June 2021-12:00 PM

హార‌ర్‌, కామెడీ చిత్రాల్లో `రాజుగారి గ‌ది` ఓ ప్ర‌త్యేకత సాధించింది. చిన్న సినిమాగా విడుద‌లై.. పెద్ద విజ‌యాన్ని అందుకుంది. ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో ఓంకార్ `రాజుగారి గ‌ది`ని ఏకంగా ఫ్రాంచైజీగా మార్చేశాడు. రాజుగారి గ‌ది 2, 3 కూడా తీశాడు. అయితే రాజుగారి గ‌ది హిట్ట‌యిన రేంజ్‌లో మిగిలిన రెండు సినిమాలూ ఆడ‌లేదు. రాజుగారి గ‌ది 3 అయితే డిజాస్ట‌ర్‌. ఈ సినిమాతో ఓంకార్ చాలా డ‌బ్బులు పోగొట్టుకున్నాడు.

 

అయితే ఈ రాజుగారి గ‌దిపై ఓంకార్ మ‌మ‌కారం పోలేదు. ఇప్పుడు ఏకంగా రాజుగారి గ‌ది 4 తీయ‌డానికి రెడీ అయ్యాడ‌ట‌. ఇందుకు సంబంధించిన క‌థ కూడా సిద్ధం చేశాడ‌ట‌. అయితే క‌రోనా కార‌ణంగా సెట్స్‌పైకి తీసుకెళ్ల‌డం వీలుకాలేద‌ట‌. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డిన త‌ర‌వాత‌.. ఈసినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తానంటున్నాడు ఓంకార్‌. ఇందులోనూ ఓంకార్ త‌మ్ముడు అశ్విన్ నే... హీరో. ప్ర‌స్తుతం హార‌ర్, కామెడీ చిత్రాల‌కు క్రేజ్ లేదు. పైగా రాజుగారి గ‌దిలో రెండు ఫ్లాపులొచ్చాయి. అయినా మ‌రోసారి అలాంటి ప్ర‌య‌త్నమే చేస్తున్నాడంటే ఓంకార్ బాగా రిస్కు తీసుకుంటున్న‌ట్టే లెక్క‌.

ALSO READ: బిగ్ బాస్ వాయిదా.. ఎప్పుడో తెలుసా?