ENGLISH

'సైరా' సెట్‌లో పవర్‌స్టార్‌.?

15 June 2018-15:23 PM

చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కుతోన్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రం ప్రస్తుతం హైద్రాబాద్‌ శివార్లలో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ షూటింగ్‌ స్పాట్‌కి పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ వెళ్లారనీ తాజా సమాచారమ్‌. 

చాలా సేపు అన్నయ్యతో పవన్‌ కళ్యాణ్‌ ముచ్చటించారనీ తెలుస్తోంది. సినిమాకి సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకున్నారట. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతోన్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రానికి సంబంధించి యాక్షన్‌ ఘట్టాల చిత్రీకరణ జరుగుతోంది ప్రస్తుతం. చరిత్రలు తెలుసుకోవడమంటే పవన్‌ కళ్యాణ్‌కి చాలా ఇష్టం. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. కథకి సంబంధించి పలు విషయాలను చిత్ర యూనిట్‌ని అడిగి తెలుసుకున్నారట పవన్‌ కళ్యాణ్‌. 

అలాగే ఈ సందర్భంగా చిరంజీవికీ, పవన్‌ కళ్యాణ్‌కీ మధ్య రాజకీయ సంబంధమైన పలు విషయాలు చర్చకు వచ్చాయనీ తెలుస్తోంది. మామూలుగా హీరోలు ఒకరి సినిమా సెట్స్‌కి, మరొకరు వెళ్తూ ఉంటుంటారు. అయితే పవన్‌ కళ్యాణ్‌, చిరంజీవిని సినిమా సెట్‌లో కలిశాడట అనే వార్త అభిమానులకు దిల్‌ ఖుషీ చేస్తోంది. ఈ ఇద్దరు అన్నదమ్ములు పలానా విషయమై కలిశారట అనే వార్త ఎప్పుడూ అభిమానులకు పండగలాంటి విషయమే. 

ఇకపోతే ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ సినిమాలకు దూరంగా ఉంటూ, జనసేన పార్టీ తరపున జనంతో మమేకమై జన యాత్రలో బిజీగా గడుపుతున్నారు.

 

ALSO READ: సమ్మోహనం మూవీ రివ్యూ & రేటింగ్