పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాల్గవ వార్షీకోత్సవం ఎల్లుండి గుంటూరు సమీపంలోని నాగార్జున విశ్వవిధ్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో జరగనుంది.
ఇక పవన్ కళ్యాణ్ తన కుటుంబసభ్యులతో కలిసి నిన్న రాత్రి విజయవాడకి చేరుకున్నారు. అక్కడే రాత్రి బస చేసిన ఆయన ఈరోజు ఉదయం మంగళగిరి దగ్గర కాజా సమీపంలోని రెండెకరాల స్థలంలో ఆయన భూమి పూజ నిర్వహించారు. ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక ఇల్లు కూడా లేదు. దీనితో ఆయన ఇప్పుడు ఒక ఇంటిని కట్టుకోబోతున్నారు.
అయితే ఈ పూర్తి వ్యవహారం ఒకరకంగా రహస్యంగానే జరిగింది అని సమాచారం. ఇక భూమిపూజకి కూడా ఎవ్వరికీ ఆహ్వానం లేదు. ఆయన కుటుంబసభ్యులుకి సైతం ఎటువంటి ముందస్తు సమాచారం లేదు అని అర్ధమవుతున్నది.
ఇక భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ అధికారిక నివాసం ఇదే కానుంది అనే అలాగే పార్టీ ఆఫీస్ గా కూడా దీన్ని వాడుకోదలిచారు అని జనసేన వర్గాలు అంటున్నాయి.
ALSO READ: టాక్ అఫ్ ది వీక్- విజయ్ దేవరకొండ ఏ మంత్రం వేసావె...