ENGLISH

ప‌వ‌న్ అంత రిస్క్ తీసుకుంటాడా?

10 February 2022-12:34 PM

ప‌వ‌న్ కల్యాణ్ ఎప్పుడు ఏ ద‌ర్శ‌కుడి క‌థ‌కు ఓకే చెబుతాడో తెలీదు. త‌న చేతిలో చాలా సినిమాలున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. రోజుకొక‌టి చేరుతూనే ఉంది. ఫ‌లానా ద‌ర్శ‌కుడితో ప‌వ‌న్ సినిమా చేస్తాడ‌ట‌, ఫ‌లానా నిర్మాత అడ్వాన్స్ ఇచ్చాడ‌ట అంటూ... ర‌క‌ర‌కాల వార్త‌లు. అందులో మ‌రోటి చేరింది. ర‌మేష్ వ‌ర్మ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని టాక్‌.

 

వీర సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారాడు ర‌మేష్ వ‌ర్మ అది అట్ట‌ర్ ఫ్లాప్‌. ఆ త‌ర‌వాత రాక్ష‌సుడు తీశాడు. అది రీమేక్. ఆ సినిమా హిట్ట‌యినా, క‌ట్ కాపీ పేస్ట్ అన్నారంతా. ఇప్పుడు ఖిలాడీ తీశాడు. ఈ సినిమాపై బ‌జ్ ఉన్న‌ప్ప‌టికీ విడుద‌లైంత వ‌ర‌కూ ఈ సినిమాలో స‌రుకు ఉందో, లేదో తెలీదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ప‌వ‌న్‌తో సినిమా అంటే.. న‌మ్మ‌బుద్ది కావ‌డం లేదు. ప‌వ‌న్ డేట్లు ఇచ్చినా ఇచ్చేస్తాడు. ఎందుకంటే త‌ను అదో ర‌కం. మ‌నిషి న‌చ్చాలంతే. క‌థ న‌చ్చ‌క‌పోయినా కాల్షీట్లు ఇచ్చేస్తాడు. అలానే చాలామంది ద‌ర్శ‌కుల్ని ప్రోత్స‌హించాడు ప‌వ‌న్‌. ఒక‌వేళ ఖిలాడి హిట్ట‌యితే, ర‌మేష్ వ‌ర్మ ప‌వ‌న్ కోసం సిద్ధం చేసిన క‌థ న‌చ్చితే.. చ‌ప‌వ‌న్ అంత రిస్క్ తీసుకోవ‌చ్చు కూడా. సినిమాల్లో ఏదైనా సాధ్య‌మే,. ప‌వ‌న్ ద‌గ్గ‌ర మ‌రింత సాధ్యం. చూద్దాం. ఏమ‌వుతుందో?

ALSO READ: సుధీర్‌బాబుని అవ‌మానించిన కెమెరామెన్‌