ENGLISH

Pawan Kalyan: ప‌వ‌న్ క‌నిపించ‌డం లేదు... అస‌లేమైంది?

30 July 2022-14:31 PM

ప‌వ‌న్ క‌ల్యాణ్ అనారోగ్యానికి గుర‌య్యారా? ప్ర‌స్తుతం ఆయ‌న విశ్రాంతి తీసుకొంటున్నారా? ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల్ని క‌ల‌వ‌రానికి గురి చేస్తున్న ప్ర‌శ్న‌లివి. గ‌త రెండు వారాలుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌నిపించ‌డం లేదు.

 

ఆయ‌న షూటింగులు ర‌ద్ద‌య్యాయి. అంతే కాదు.. జ‌న‌సేన కార్య‌క్ర‌మాల్లోనూ ప‌వ‌న్ పాల్గొన‌డం లేదు. గ‌త‌వారం ప్ర‌జావాణి కార్య‌క్ర‌మం ప‌వ‌న్ లేక‌పోవ‌డంతో ర‌ద్ద‌య్యింది. రేపు కూడా జ‌న‌వాణి ఉంది. ఈసారీ ర‌ద్ద‌య్యే అవ‌కాశాలే ఎక్కువ ఉన్నాయి. ఆమ‌ధ్య ప‌వ‌న్ క‌ల్యాణ్ గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌టించారు. అప్ప‌టి నుంచీ.. ఆయ‌న‌కు ఒంట్లో బాగాలేద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న విశ్రాంతి మూడ్ లో ఉన్నార‌ని, పూర్తిగా కోలుకొన్న త‌ర‌వాతే.. మ‌ళ్లీ జ‌న‌వాణిలో పాల్గొంటార‌ని తెలుస్తోంది. గోదావ‌రి జిల్లా ప్రాంత వాసులు వ‌ర‌ద స‌మ‌స్య‌ల‌తో అల్ల‌డుతున్నా.. ప‌వ‌న్ వెళ్ల‌క‌పోవ‌డం కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న‌కు ఒంట్లో బాగోలేక‌పోవ‌డం వ‌ల్లే... వ‌ర‌ద ప్రాంతాల్ని సంద‌ర్శించ‌లేక‌పోయార‌ని జ‌న సేన నాయ‌కులు చెబుతున్నారు. అయితే.. అస‌లు స‌మ‌స్యేమిట‌న్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ చెప్ప‌లేదు.

క‌నీసం నాదెండ్ల మ‌నోహ‌ర్ లాంటి వ్య‌క్త‌యినా, ప‌వ‌న్‌కి ఒంట్లో బాగోలేద‌ని, త్వ‌ర‌లోనే ఆయ‌న క‌లుస్తార‌ని ఓ ప్రెస్ నోట్ విడుద‌ల చేసినా.. అభిమానులు ఈ కంగారు త‌గ్గేది.

ALSO READ: ప్రాజెక్ట్ కె, సలార్.. సవ్యసాచి ప్రభాస్ !