జనసేనాని పవన్ కళ్యాణ్ ఇంకొద్ది నిమిషాలలో తన రాజకీయ పార్టీ నాల్గవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అభిమానులైనటువంటి కార్యకర్తలని అలాగే తెలుగు ప్రజలని ఉద్దేశ్యించి ప్రసంగించబోతున్నాడు.
ఇక ఈరోజు ఆయన ప్రసంగం వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలనే దృష్టిలో పెట్టుకొని సాగుతుంది అన్న అంచనా అందరిలోనూ ఉంది. అయితే ఆయన ప్రత్యర్ధులు ఇంకొంతమంది రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇదొక సామాన్య ప్రసంగం మాత్రమే అనే జ్యోత్స్యం చెబుతున్నారు.
ఇవ్వన్ని పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ అనే ఒక కీలకమైన అంశం ఇప్పుడు జనసామాన్యంలో నడుస్తుండగా ఆయన ఆ విషయం పైన ఎటువంటి పంథా అనుసరించానున్నాడు అన్నది ఇప్పుడు అందరిలోనూ ఉన్న ప్రశ్న.
ప్రశ్నించడానికే తాను ఉన్నది తన పార్టీ ఉన్నది అని పదేపదే చెప్పే పవన్ నుండి ఇప్పుడు అందరు ఎదురుచూస్తున్నది స్పెషల్ స్టేటస్ సాధించడానికి ఆయన ఏమి చేయబోతున్నాడు అని. త్వరలోనే జరగబోయే ఎన్నికల్లో ఆయన పాత్ర ఎలా ఉండబోతున్నది? 2014లో లాగా పరోక్షంగానా లేక ఈ సంవత్సరం ప్రత్యక్షంగా పాల్గొంటాడా అన్న ప్రశ్నలకి ఆయన నుండి సమాధానం కోసం అందరు వేచి చూస్తున్నారు.
మరి ఈ ప్రశ్నలకి పవన్ కళ్యాణ్ సమాధానం చెబుతాడా లేక ఇంకేదైనా అనూహ్యంగా కీలక ప్రకటనలు చేస్తాడా అన్నది ఇంకొన్ని గంటలు ఆగితే తేలిపోతుంది...
ALSO READ: విద్యాబాలన్‌ని అడిగారు... కానీ