పవన్ కల్యాణ్ దగ్గర ఉన్న కంప్లైంట్ ఒక్కటే. సినిమా షూటింగ్ అంటే మొహం చాటేస్తాడని, షూటింగులంటే పెద్దగా ఆసక్తి చూపించడని, తనతో సినిమా ఒప్పుకుంటే ఎప్పుడు పూర్తవుతుందో తెలీదని.. కామెంట్లు వినిపిస్తుంటాయి. పవన్ చేతిలో ఇన్ని సినిమాలున్నా, వాటి వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. దానికి కారణం.. పవన్ స్లో అండ్ స్టడీ తత్వమే. పవన్ చేతిలో సినిమాలెప్పుడు పూర్తవుతాయో..? అంటూ అభిమానులూ ఆసక్తిగా, ఓపిగ్గా ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఎట్టకేలకు పవన్ స్పీడు పెంచాడు.
చేతిలో ఉన్న సినిమాల్ని ఒకొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా `వకీల్ సాబ్` షూటింగ్ కి స్వస్తి పలికాడు పవన్. మంగళవారంతో `వకీల్ సాబ్` లో పవన్ పార్ట్ పూర్తయిపోయింది. ఇక ఆయనకు `వకీల్ సాబ్` నుంచి విముక్తి లభించినట్టే. ఇప్పుడు వెంటనే క్రిష్ సినిమా మొదలెట్టబోతున్నాడు పవన్. జనవరి 4 నుంచి క్రిష్ సినిమా మొదలవుతుంది. పవన్ సెట్లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈనెలాఖరు వరకూ.. క్రిష్ సినిమాతోనే ఉండబోతున్నాడు పవన్. ఫిబ్రవరిలో అయ్యప్పయుమ్ కోషియమ్ మొదలయ్యే ఛాన్సుంది. ఈలోగా.. క్రిష్ సినిమాని వీలైనంత వరకూ పూర్తి చేయాలని భావిస్తున్నాడు పవన్. ఈ స్పీడు మును ముందూ కొనసాగితే.. పవన్ చేతిలో ఉన్న సినిమాలన్నీ చక చక పూర్తయిపోతాయి.
ALSO READ: పాపం.. అందాల భామలకు ఆ ఛాన్స్ మిస్సయ్యిందట.!