ENGLISH

పవన్ కళ్యాణ్ మనసు గెల్చుకున్న కీరవాణి

30 September 2024-13:26 PM

తిరుమల కల్తీ లడ్డూ వివాదం రోజు రోజుకి పెరిగి తీవ్ర చర్చనీయంశంగా మారింది.  కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిని వేదనకు గురయ్యారు. డిప్యుటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ దీనిని అనవసర రాజకీయం చేయకుండా తన మటుకు తాను ప్రక్షాళనగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. విజయవాడ దుర్గ గుడి ప్రక్షాళన చేసారు. ప్రజలకి సనాతన ధర్మం పట్ల అవగాహన కల్పించారు. అందుకే సినీ , రాజకీయ ప్రముఖులు పవన్ కి అండగా నిలిచారు. వివాదాలకి సోషల్ మీడియా కి దూరంగా ఉండే SP శైలజ లాంటి వారు కూడా పవన్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. 


పవన్ కళ్యాణ్ ని ఆదర్శంగా తీసుకుని పలువురు నాయకులు, ప్రజలు, జనసేన కార్యాకర్తలు  ఆలయాల్లో పూజలు, హోమాలు, భజనలు నిర్వహిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ ఆస్కార్ విజేత కీరవాణి కూడా ‘ఓం నమో నారాయణాయ’ మంత్రాన్ని అందరికీ ఉపయోగపడేలా ఆడియో ఫార్మాట్‌లో రికార్డ్‌ చేశారు. కీరవాణి చేపట్టిన ఈ బృహ్హత్తర కార్యాన్ని పవన్ ప్రశంసిస్తూ   ధన్యవాదాలు తెలియజేశారు. 


'కీరవాణి రూపొందించిన ఓం నమో నారాయణాయ ఆడియో మంత్రం చాలా  భక్తిభావంతో సాగిందని, దీన్ని రూపొందించడంలో సహాయపడిన సంగీత కళాకారులకు, టెక్నీషియన్స్ కి జనసేన తరపున, AP ప్రజల తరపున పవన్ కృతజ్ఞతలు తెలియజేశారు.