ENGLISH

Pawan Kalyan: బాస్ పార్టీకి తోడైన పవన్ కళ్యాణ్

22 November 2022-18:30 PM

చిరంజీవి 'వాల్తేర్ వీరయ్య' ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ విడుదలకు రెడీ అయ్యింది. ఇప్పటికే ప్రోమో వదిలారు. ఇప్పుడు వవన్ కళ్యాణ్ కూడా ఈ పాటకు తోడయ్యారు. పవన్ కళ్యాణ్ తన హరిహర వీరమల్లు చిత్ర దర్శకుడు క్రిష్, నిర్మాత ఏఎమ్ రత్నంతో కలిసి వీరయ్య సెట్స్‌ కి వెళ్లారు. సెట్ లో బాస్ పార్టీ పాటను చేశారు. షూటింగ్ స్పాట్‌కి వెళ్లి పాటను చూస్తున్న ఫోటోలని కూడా బయటికి వదిలారు. ఈ రకంగా వీరయ్య పార్టీ సాంగ్ కి పవన్ కూడా కలిసొచ్చినట్లయింది.

 

బాస్ పార్టీలో చిరంజీవి సరసన ఊర్వశి రౌతేలా సందడి చేస్తోంది. ఎస్పీ పాటకు లిరిక్స్ రాయడం మరో విశేషం. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. శృతి హాసన్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది.

ALSO READ: Srikanth: ఫేక్ వెబ్‌సైట్లు, ఛానళ్లకు శ్రీకాంత్ వార్నింగ్