ENGLISH

పాయ‌ల్‌కి మ‌ళ్లీ మంచి రోజులొచ్చేనా?

12 November 2020-15:00 PM

`ఆర్‌.ఎక్స్‌. 100`తో దుమ్ము రేపేసింది పాయ‌ల్ రాజ్ పుత్‌. ఆ సినిమాలో హాట్ గా క‌నిపించి కుర్ర కారు హృద‌యాల్ని కొల్ల‌గొట్టింది. సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవ‌డంతో పాయ‌ల్ కి విరివిగా అవ‌కాశాలొచ్చాయి. అయితే ఏవీ పాయల్ కి గుర్తింపు తీసుకురాలేదు. ఐటెమ్ సాంగ్స్ చేసినా కిక్ ఇవ్వ‌లేదు. దాంతో పాయ‌ల్ వ‌న్ సినిమా వండ‌ర్ గా మిగిలిపోయింది.

 

అయితే ఇప్పుడు మ‌ళ్లీ పాయ‌ల్ కి అవ‌కాశాలొస్తున్నాయి. చైతన్య కృష్ణతో కలిసి 'అనగనగా ఓ అతిథి' అనే సినిమాలో నటిస్తోంది. శుక్ర‌వారం ఈ సినిమా ఆహాలో విడుద‌ల కాబోతోంది. ఇందులో మ‌ల్లిక‌గా న‌టించింది పాయ‌ల్‌. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో 'నరేంద్ర' అనే సినిమాలో నటించింది. ఆసినిమా అప్ డేట్ ఇంకా బ‌య‌ట‌కు రావాల్సివుంది. తమిళ్ లో ఉదయనిధి స్టాలిన్ సరసన 'ఏంజెల్' అనే హారర్ థ్రిల్లర్ లో నటిస్తోంది. ఈసినిమాలో పాయ‌ల్ మ‌రింత గ్లామ‌రెస్‌గా క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. వీటిలో ఏది హిట్ట‌యినా,.. పాయ‌ల్ మ‌ళ్లీ త‌న త‌డాఖా చూపించ‌డం ఖాయం. విజ‌యాలు అందుకోక‌పోతే మాత్రం.. పాయ‌ల్ ని మ‌ర్చిపోవాల్సిందే.

ALSO READ: ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్ ప్రొడ‌క్ష‌న్ నెం 6 లో హీరోగా క‌ళ్యాణ్ దేవ్!