ENGLISH

పాపం... మంచు.. గాలి తీసేసిన మంత్రి గారు

12 February 2022-10:36 AM

మంచు విష్ణు అత్యుత్సాహం... కాస్త ఆయ‌న ప‌రువు తీసేంత వ‌ర‌కూ వెళ్లింది. శుక్ర‌వారం హైద‌రాబాద్ లోని మోహ‌న్ బాబు ఇంటికి ఏపీ మంత్రి పేర్ని నాని వెళ్లారు. ఆ వెంట‌నే.. విష్ణు ఓ ట్వీట్ చేశారు."మీకు మా ఇంట్లో ఆతిథ్యమివ్వడం చాలా సంతోషంగా ఉంది నాని గారు" అని ఆయన ట్వీట్‌లో విష్ణు పేర్కొన్నారు.

 

అలాగే, 'సినిమా టికెట్ల అంశంపై మీరు తీసుకున్న చొరవకు, తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఏపీ ప్రభుత్వ ప్రణాళికలను మాకు వివరించినందుకు ధన్యవాదాలు. ఇండస్ట్రీ ప్రయోజనాలను కాపాడుతున్నందుకు కృతజ్ఞతలు' అని రాసుకొచ్చారు. దీనికి స్పందించిన నాని..'మోహన్‌బాబు పిలిస్తే మర్యాదపూర్వకంగా వెళ్ళాను. అంతే తప్ప విష్ణు చెప్పినట్టుగా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలేవీ చర్చించలేదు.

 

ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను ఎవ‌రితోనూ చ‌ర్చించే అవ‌కాశ‌మే లేదు` అన్నారు. దాంతో విష్ణు ఈ ట్వీట్‌ను వెంటనే డిలీట్ చేశారు. అంతే, ఇక సోషల్ మీడియాలో నెటిజన్స్ రక రకాలుగా కామెంట్స్ చేస్తూ మంచు విష్ణును ట్రోల్ చేస్తున్నారు. విష్ణు అత్యుత్సాహంతో వేసిన ఆ ట్వీట్‌.. ఇప్పుడు ఆయ‌న గాలి తీసేసేలా చేసింది.

ALSO READ: 'భామాకలాపం' రివ్యూ & రేటింగ్