ENGLISH

ప్రభాస్ కు సంగీతం నేర్పిస్తుందా?

13 July 2020-11:00 AM

రెబెల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా 'రాధే శ్యామ్' ఫస్ట్ లుక్ రెండు రోజుల క్రితం విడుదలయిన సంగతి తెలిసిందే. చాలారోజుల నుంచి ఎదురు చూస్తున్న ఫస్ట్ లుక్ రావడంతో అటు ప్రభాస్ అభిమానులు, ఇటు సినిమా ప్రేమికులు థ్రిల్ అయ్యారు. సోషల్ మీడియాలో అయితే 'రాధే శ్యామ్' ఒక హాట్ టాపిక్ గా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర గురించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ కనిపిస్తోంది.

 

ఈ సినిమాలో పూజ సంగీతం నేర్పించే టీచర్ గా నటిస్తోందని అంటున్నారు. ఈ సినిమా 1960 నేపథ్యంలో తెరకెక్కుతుందని, ఇటలీ లో కొంత భాగం కథ జరుగుతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ లెక్కన విదేశాలలో సంగీతం నేర్పించే టీచర్ గా కనిపిస్తుందని మనం ఫిక్స్ అయిపోవచ్చు. అయితే ఈ సంగీతం టీచర్ లో ప్రభాస్ ఎలా ప్రేమలో పడతాడో ఏమో. ఒకవేళ పూజ దగ్గర సంగీతం నేర్చుకుంటూ పనిలో పనిగా రివర్సులో ఆమెకు ప్రేమపాఠాలు చెప్తాడేమో వేచి చూడాలి.

 

పూర్తి స్థాయి లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ 50% పైగా కంప్లీట్ అయింది. ప్రస్తుతం విదేశాలలో షూటింగ్ చేసే పరిస్థితులు లేవు కాబట్టి హైదరాబాద్ లో సెట్లు నిర్మాణం చేస్తున్నారట. పరిస్థితులు అనుకూలించిన వెంటనే నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం అవుతుందని అంటున్నారు.

ALSO READ: Pooja Hegde Latest Photoshoot