ENGLISH

ప్ర‌భాస్ ఎంట్రీ ఖాయ‌మైంది.

05 June 2020-10:00 AM

సుదీర్ఘ విరామం త‌ర‌వాత‌.. ప్ర‌భాస్ సినిమా మ‌ళ్లీ సెట్స్‌పైకి రాబోతోంది. లాక్ డౌన్ నుంచి చిత్రీక‌ర‌ణ‌ల‌కు మిన‌హాంపులు ల‌భిస్తున్న నేప‌థ్యంలో జులై మొద‌టి వారంలో.. ప్రభాస్ - రాధాకృష్ణ సినిమా పునః ప్రారంభం కానుంది. యూవీ క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇట‌లీ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. నిజానికి షూటింగ్ అంతా అక్క‌డే జ‌రగాలి. కానీ ఇంటీరియ‌ర్ మొత్తం హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో లాగించేస్తున్నారు.

 

ఇట‌లీ అవుడ్డోర్‌లో తీయాల్సిన సీన్లు కూడా ఇప్పుడు అన్న‌పూర్ణ‌లోనే చేయాల్సివ‌స్తోంది. ఇందుకోసం ప్ర‌ముఖ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో అన్న‌పూర్ణ లో సెట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. మేజ‌ర్ షెడ్యూల్ అంతా... ఈ సెట్స్‌లోనే పూర్తి చేయ‌నున్నారు. ఈ సినిమా టైటిల్ ఏమిట‌న్న‌ది ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. దాదాపుగా `రాధే శ్యామ‌` ఖాయం చేసేయొచ్చు. కొత్త షెడ్యూల్ మొద‌లైన తొలిరోజునే.. ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్‌నీ, ఈ టైటిల్‌ని విడుద‌ల చేసే ఆలోచ‌న‌లో ఉంది చిత్ర‌బృందం.

ALSO READ: ర‌హ‌స్య పెళ్లి గురించి... న‌వదీప్ ఏమంటున్నాడు?