మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చి సూపర్ సక్సెస్ అయ్యింది. బాలీవుడ్ లో అప్పటి వరకు ఎన్ని సినిమాలు, సీరియల్స్ చేసినా రాని గుర్తింపు సౌత్ లో ఒక్క సినిమాతో వచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన 'సీతా రామం' సినిమాలో దుల్కర్ తో కలిసి నటించి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది మృణాల్. సీతా రామం ఎన్నో అవార్డులు రివార్డులు గెల్చుకుంది. ఫిలిం ఫేర్, ఐఫా లాంటి అవార్డు ఫంక్షన్స్ లో సత్తా చాటింది. ఈ సినిమాతో మృణాల్ దశ తిరిగింది. తెలుగులో నెక్స్ట్ నాని, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి ప్రశంసలు దక్కించుకుంది.
హాయ్ నాన్న కూడా చాలా అవార్డ్స్ గెల్చుకుంది. బెస్ట్ యాక్టర్ గా మళ్ళీ మృణాల్ నిలిచింది. మృణాల్ కెరియర్ సక్సెస్ సాదించటానికి కారణం హను రాఘవపూడి అని చెప్పొచ్చు. హను ప్రస్తుతం ప్రభాస్ తో ఫౌజీ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో ప్రభాస్ సరసన ఒక కొత్త అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇమాన్వీ అనే ఢిల్లీ బ్యూటీ ఈ మూవీతో తెరంగేట్రం చేస్తోంది. మొదట మృణాల్ ని హీరోయిన్ గా తీసు కుంటారని ప్రచారం జరిగింది. సీతా రామం తో మంచి హిట్ అందుకున్న హను, మృణాల్ కాంబో రిపీట్ అవుతుంది అనుకున్నారు. కానీ ఎందుకో మృణాల్ ఆ ఛాన్స్ మిస్ అయ్యింది.
ఇప్పుడు ఫౌజీలో మృణాల్ కూడా ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కారణం హను తన సెంటిమెంట్ ఫాలో అవుతూ, మృణాల్ కోసం కూడా ఒక పాత్ర రాసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న మృణాల్ తెలుగులో 'ఫ్యామిలీ స్టార్' సినిమా తరువాత ఇంకో సినిమా ఒప్పుకోలేదు. ఇప్పుడు ఫౌజీ లో నటిస్తే అమ్మడి క్రేజ్ మరింత పెరుగుతుంది. పాన్ ఇండియా హీరోయిన్ లిస్ట్ లో చేరుతుంది.
ALSO READ: 2024... ఫినిషింగ్ టచ్ ఎవరు ఇస్తారు?