ENGLISH

గ‌ప్ చుప్‌గా ప్రారంభ‌మైన ప్ర‌భాస్ సినిమా

24 July 2021-10:14 AM

ప్ర‌భాస్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఓ వైపు రాధేశ్యామ్ జ‌రుగుతోంది. మరోవైపు స‌లార్‌. ఆమ‌ధ్య‌నే.. `ఆది పురుష్‌` కూడా ప్రారంభ‌మైంది. ఇప్పుడు మ‌రో సినిమా ప‌ట్టాలెక్కేసింది. ప్ర‌భాస్ - నాగ అశ్విన్ కాంబినేష‌న్ లో ఓ సినిమా ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి అప్ డేట్ లేదు. 2023లో ఈ సినిమాని విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం ముందే ప్ర‌క‌టించింది. కాబ‌ట్టి.. ఈలోగా మొద‌ల‌య్యే ఛాన్స్ లేదులే అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా ఈ సినిమా మొద‌లైపోయింది.

 

శ‌నివారం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ సినిమాకి క్లాప్ కొట్టారు. బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ ఓ కీల‌క‌మైన పాత్ర‌ని పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న కూడా సెట్లోకి వ‌చ్చేశారు. ప్ర‌స్తుతం ట్రైల్ షూట్ సాగుతోంద‌ని స‌మాచారం. గెట‌ప్పులు ఎలా వ‌చ్చాయో.. టెస్ట్ చేయ‌డానికి ఈ షూట్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్ర‌భాస్, బిగ్ బీ గెట‌ప్పులు ఈ సినిమాలో కొత్త‌గా ఉంటాయ‌ని టాక్‌. అందుకే ట్రైల్ షూట్ సాగుతోంది. ఈ చిత్రంలో దీపికా ప‌దుకొణె క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌ను కూడా త్వ‌ర‌లోనే సెట్లోకి అడుగుపెట్ట‌బోతోంద‌ట‌.

ALSO READ: మ‌హేష్ కోసం రాజ‌మౌళి తొలిసారి చేస్తున్న ప్ర‌యోగం