ENGLISH

రాధేశ్యామ్ రీషూట్లు ఆగ‌వా?

17 July 2021-16:30 PM

ప్ర‌భాస్ - పూజాహెగ్డే జంట‌గా న‌టిస్తున్న చిత్రం `రాధేశ్యామ్‌`. ఈ సినిమా రెండేళ్లుగా సెట్స్‌పైనే ఉంది. షూటింగ్ ఎంత‌కీ పూర్త‌వ్వ‌డం లేదు. ఇట‌లీ నేప‌థ్యంలో సాగే ప్రేమ‌క‌థ ఇది. షూటింగ్ అంతా అక్క‌డే చేద్దామ‌నుకున్నారు. కానీ... కొంత మేర షూటింగ్ జ‌రిపాక‌.. క‌రోనా వ‌చ్చింది. క‌రోనా వ‌చ్చాక‌.. మ‌ళ్లీ ఇట‌లీ వెళ్ల‌లేదు చిత్ర‌బృందం. ఇట‌లీలో తీయాల్సిన స‌న్నివేశాల్ని హైద‌రాబాద్ లోనే సెట్స్ వేసి పూర్తి చేశారు. అయితే కొన్ని స‌న్నివేశాల్ని మాత్రం రీషూట్ చేయాల్సివ‌చ్చింది. అందుకే షూటింగ్ ఆల‌స్య‌మైంది.

 

మొన్నామ‌ధ్య రాధేశ్యామ్ టీమ్ షూటింగ్ దాదాపుగా పూర్త‌యిపోయింద‌ని ప్ర‌క‌టించింది. అయితే ఇప్పుడు ర‌షెష్ చూసిన ప్ర‌భాస్.. మ‌రి కొన్ని సీన్లు రీషూట్ చేయాల‌ని చెప్పాడ‌ట‌. దాంతో.. మ‌రో షెడ్యూల్ కేవ‌లం రీషూట్ల‌కే కేటాయించింది చిత్ర‌బృందం. ఈనెల 23నుంచి ఆగ‌స్టు 5 వ‌ర‌కూ రాధేశ్యామ్ షెడ్యూల్ హైద‌రాబాద్ లో జ‌ర‌గ‌బోతోంది. ఈ 12 రోజుల షెడ్యూల్ పూర్తిగా రీషూట్ల కోస‌మే అట‌. అప్ప‌టికైనా రాధేశ్యామ్ పూర్త‌వుతుందా, లేదంటే.. మ‌రోసారి రీషూట్ కి వెళ్తుందా? ఏమో.. మ‌రి.. ఈ సినిమా ని ఏ ముహూర్తాన మొద‌లెట్టారో గానీ, రీషూట్ల మీద రీషూట్లు జ‌రుగుతున్నాయి. ఈ పరంప‌ర ఆగేదెప్పుడో?

ALSO READ: విజయ్ సేతుపతి తొలి జీతం ఎంతో తెలుసా?