ENGLISH

సూపర్‌హీరోకి నో చెప్పిన ప్రబాస్‌.!

30 January 2020-17:03 PM

'బాహుబలి' తర్వాత ప్రబాస్‌ అంటే భారీ బడ్జెట్‌, భారీ కథా, కథనాలున్న ప్రెస్టీజియస్‌ మూవీస్‌నే ఆడియన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు. ఆడియన్స్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ని అందుకోవాలనే తపనతో 'బాహుబలి' తర్వాత ఆ రేంజ్‌ ఇమేజ్‌ ఉన్న 'సాహో' మూవీలో నటించాడు ప్రబాస్‌. కానీ, ఈ సినిమా రిజల్ట్‌ పూర్తిగా రివర్స్‌ కొట్టడంతో, ఆ ఆలోచన నుండి పూర్తిగా స్కిప్‌ అయిపోయాడు. ఇకపై ప్రబాస్‌ తనపై పడిన సూపర్‌ హీరో ఇమేజ్‌కొ గుడ్‌బై చెప్పేయాలనుకుంటున్నాడట. గతంలోలా డార్లింగ్‌ అయిపోవాలనుకుంటున్నాడట. లవ్‌ స్టోరీస్‌కీ, డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లే ఉన్న మూవీస్‌కీ ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాడట.

 

అన్నింటికీ మించి తన సినిమా బడ్జెట్‌ బాగా తగ్గించేయాలనుకుంటున్నాడట. మినిమమ్‌ బడ్జెట్‌ సినిమాతోనే ప్యాన్‌ ఇండియా ప్లాన్స్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ప్రబాస్‌ కొత్త దర్శకులకు అవకాశమివ్వాలనే యోచనలో ఉన్నాడట. ప్రస్తుతం 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణతో ప్రబాస్‌ ఓ సినిమాలో నటిస్తున్నాడు. 'జాన్‌' అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. క్యాజువల్‌ అండ్‌ క్యూట్‌ లవ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమా ఎనభై శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుందట. బుట్టబొమ్మ పూజా హెగ్దే ఈ సినిమాలో ప్రబాస్‌తో జత కడుతోంది. ఒక్క పోస్టర్‌ మినహా ఇంతవరకూ ఈ సినిమా అప్‌డేట్‌ ఏమీ లేదు కానీ, త్వరలోనే ఈ సినిమా నుండి ఓ బెస్ట్‌ అప్‌డేట్‌ని ప్లాన్‌ చేస్తున్నారట.

ALSO READ: తొలి అనుభవం: రాజుగారు ముందే చెప్పేశారు.!