ENGLISH

'సాహో' షురూ చేసిన ప్రబాస్‌

18 August 2017-17:30 PM

''ఇట్స్‌ షూట్‌ టైమ్‌' దాదాపు నాలుగున్నరేళ్ల బాహుబలి ప్రయాణం తర్వాత 'సాహో' అనే యాక్షన్‌ ప్రపంచంలోకి ప్రవేశించడం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది' అని సోషల్‌ మీడియాలో ప్రబాస్‌ చెప్పాడు. లేటెస్టుగా ప్రబాస్‌ 'సాహో' షూటింగ్‌లో పాల్గొన్నాడు. 'రన్‌ రాజా రన్‌' సినిమాతో హిట్‌ అందుకున్న యంగ్‌ డైరెక్టర్‌ సుజిత్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ ఈ సినిమాలో నటిస్తుండడం విశేషం. భారీ బడ్జెట్‌ మూవీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇంతవరకూ ప్రబాస్‌ లేకుండా కొన్ని సీన్లు చిత్రీకరించారు. తాజాగా యాక్షన్‌లోకి దిగాడు ప్రబాస్‌. పక్కా యాక్షన్‌ మూవీగా ఈ సినిమా తెరక్కెబోతోందట. 'బాహుబలి' కోసం గత నాలుగేళ్లుగా కత్తి యుద్ధాలు, విలు విద్యలు, గుర్రపు స్వారీల్లో ఆరితేరిన ప్రబాస్‌ ఈ సినిమా కోసం మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాడట. హాలీవుడ్‌ రేంజ్‌లో యాక్షన్‌ సన్నివేశాలను ఈ సినిమాలో చూపించనున్నారట. శంకర్‌ ఎహసాన్‌ లాయ్‌ ఈ సినిమాకి మ్యూజిక్‌ అందిస్తున్నారు. సూపర్‌ స్టైలిష్‌ లుక్‌లో ప్రబాస్‌ కనిపించనున్నాడు ఈ సినిమాలో. ఇప్పటికే 'సాహో' టీజర్‌ సంచలనాలు సృష్టించింది. 'ఇట్స్‌ షో టైమ్‌' అంటూ యాక్షన్‌ని సింపుల్‌గా చూపించేశారు ఆ టీజర్‌లో. ఇక యాక్షన్‌ హీరో సెట్‌లోకి అడుగు పెట్టాడు. ఇక కుమ్ముడే కుమ్ముడు. హైద్రాబాద్‌ ఓ భారీ షెడ్యూల్‌ ప్లాన్‌ చేశారనీ సమాచారమ్‌. ఎక్కువ భాగం స్టంట్‌ సీన్స్‌ని విదేశాల్లో చిత్రీకరించనున్నారట.

ALSO READ: ఆనందో బ్ర‌హ్మ‌ రివ్యూ & రేటింగ్స్